Share News

సమాజ స్థాపన కోసమే కూటమి ఏర్పాటు

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:29 AM

వైసీపీ విష రాజకీయ పరిస్థితుల నుంచి రాష్ర్టాన్ని బయటకు తీసుకొచ్చి ఆరోగ్యవంతమైన సమాజం నెలకొల్పడం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిందని ఏలూరు కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య(చంటి) అన్నారు.

సమాజ స్థాపన కోసమే  కూటమి ఏర్పాటు
ఏలూరు ప్రజాసంకల్ప యాత్రలో బడేటి చంటికి హారతిస్తున్న మహిళలు

ఏలూరుటూటౌన్‌, ఏప్రిల్‌ 26: వైసీపీ విష రాజకీయ పరిస్థితుల నుంచి రాష్ర్టాన్ని బయటకు తీసుకొచ్చి ఆరోగ్యవంతమైన సమాజం నెలకొల్పడం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిందని ఏలూరు కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య(చంటి) అన్నారు. శుక్రవారం ఏలూరు 18వ డివిజన్‌లో ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశమని అన్నారు. ఫ్యాక్షనిజం పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు ప్రజాచైతన్యం అవసరమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజలు ఏ విధంగా నష్టపోయారో వివరిస్తున్నామ న్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందని ఆ ప్రభుత్వాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. రాష్ర్టానికి పట్టిన చీడను వదిలించేందుకు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకోవాలన్నారు. రాష్ర్టాభివృద్ధి మోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లతోనే సాధ్యమన్నారు. ప్రజలంతా ఏకమై జగన్‌ ప్రభుత్వాన్ని కూలదోయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి రెడ్డి అప్పలనాయుడు, యుడా మాజీ చైర్మన్‌ ఈశ్వరిబలరామ్‌, గాది రాంబాబు, నాగం శివ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:29 AM