Share News

వడ్డీ రేట్ల తగ్గింపు ఇప్పట్లో లేనట్టే

ABN , Publish Date - Apr 17 , 2024 | 02:22 AM

దేశంలో కీలక వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. అసలు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రెపో రేటును...

వడ్డీ రేట్ల తగ్గింపు ఇప్పట్లో లేనట్టే

మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా

న్యూఢిల్లీ: దేశంలో కీలక వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. అసలు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రెపో రేటును ప్రస్తుత 6.5 శాతం నుంచి తగ్గించే అవకాశమే లేదని బ్రోకరేజీ సంస్థ మోరాన్‌ స్టాన్లీ ఇండియా తన తాజా నివేదికలో తెలిపింది. జీడీపీ వృద్ధి రేటు జోరు మీద ఉండడం, అమెరికా కేంద్ర బ్యాంక్‌ ‘ఫెడ్‌ రిజర్వ్‌’ జూన్‌లో కూడా కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేకపోవడం ఇందుకు ప్రధాన కారణమని మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా ప్రధాన ఆర్థికవేత్త ఉపాసన చక్ర, ఆర్థికవేత్త బనీ గంభీర్‌ తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ రెండు కారణాలతో ప్రస్తుత అధిక రెపో రేటు కొనసాగించడమే మేలని ఆర్‌బీఐ భావిస్తున్నట్టు వీరు తెలిపారు. అమెరికాలోనూ ప్రస్తుతం ద్రవ్యోల్బణం అధికంగా ఉండటంతో పాటు వృద్ధి రేటు కూడా అధికంగా ఉన్న విషయాన్ని వారు గుర్తు చేశారు.

Updated Date - Apr 17 , 2024 | 02:22 AM