Share News

గ్లాండ్‌ ఫార్మా ఔషధానికి ఎఫ్‌డీఏ ఆమోదం

ABN , Publish Date - May 08 , 2024 | 04:37 AM

అమియోట్రోఫిక్‌ లాటరల్‌ స్లెరోసిస్‌ (కండరాల కదలికలకు సహాయపడే నరాలు క్రమంగా చచ్చుబడిపోవడం) వ్యాధి చికిత్సలో ఉపయోగించే ఎడరవోన్‌ ఇంజెక్షన్‌కు...

గ్లాండ్‌ ఫార్మా ఔషధానికి ఎఫ్‌డీఏ ఆమోదం

న్యూఢిల్లీ: అమియోట్రోఫిక్‌ లాటరల్‌ స్లెరోసిస్‌ (కండరాల కదలికలకు సహాయపడే నరాలు క్రమంగా చచ్చుబడిపోవడం) వ్యాధి చికిత్సలో ఉపయోగించే ఎడరవోన్‌ ఇంజెక్షన్‌కు అమెరికన్‌ ఎఫ్‌డీఏ అనుమతి లభించినట్టు గ్లాండ్‌ ఫార్మా ప్రకటించింది. 30ఎంజీ/100 ఎంఎల్‌, 60ఎంజీ/100 ఎంఎల్‌ పరిమాణంలో ఈ ఇంజెక్షన్‌ను మార్కెటింగ్‌ చేయనున్నట్టు పేర్కొంది. వర్తమాన ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఔషధాన్ని తమ మార్కెటింగ్‌ భాగస్వామి ద్వారా ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ ఏడాది జనవరితో ముగిసిన ఏడాది కాలంలో ఈ ఔషధం అమ్మకాలు 1.9 కోట్ల డాలర్ల మేరకున్నాయి.

Updated Date - May 08 , 2024 | 04:37 AM