Share News

ఫార్మా ఎగుమతులు.. రూ.2.32 లక్షల కోట్లు

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:36 AM

గత ఆర్థిక సంవత్సరం (2023-24) భారత్‌ నుంచి 2,790 కోట్ల డాలర్ల (సుమారు రూ.2.32 లక్షల కోట్లు) విలువైన ఔషధాలు, పార్మా ఉత్పత్తులు ఎగుమతయ్యాయి...

ఫార్మా ఎగుమతులు.. రూ.2.32 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2023-24) భారత్‌ నుంచి 2,790 కోట్ల డాలర్ల (సుమారు రూ.2.32 లక్షల కోట్లు) విలువైన ఔషధాలు, పార్మా ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోలిస్తే ఇది 9.67 శాతం ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరం మన మొత్తం ఎగుమతులు 3 శాతం పడిపోయినా ఫార్మా ఎగుమతులు 9.67 శాతం పెరగడం విశేషం. ఈ ఏడాది మార్చిలో అయితే ఫార్మా ఎగుమతులు 12.73 శాతం పెరిగి 280 కోట్ల డాలర్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం మన ఫార్మా ఎగుమతుల్లో ఎక్కువ భాగం అమెరికా, బ్రిటన్‌, నెదర్లాండ్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ దేశాలకు ఎగుమతయ్యాయి. మన మొత్తం ఫార్మా ఎగుమతుల్లో 31 శాతం అమెరికానే దిగుమతి చేసుకుంది. భారత ఫార్మా కంపెనీలు 60 రకాల అనారోగ్య సమస్యల చికిత్సకు అవసరమైన 60,000 రకాల జెనరిక్‌ ఔషధాలు ఉత్పత్తి చేస్తూ విదేశీ మార్కెట్లలోనూ తమ సత్తా చాటుతున్నాయి.

Updated Date - Apr 25 , 2024 | 05:36 AM