Share News

Alcohol flavours: బీర్ ప్రియులకు ఇక పండగే.. అందుబాటులోకి కొత్త ఫ్లేవర్లు..

ABN , Publish Date - Apr 15 , 2024 | 10:12 AM

నేను మద్యం తాగను.. కాని బీర్ తాగుతా అని చాలా మంది నోట వింటూ ఉంటాం. మద్యానికి వ్యసనం కాకపోయినా.. పని ఒత్తిడిలోంచి ఉపశమనం కోసం లేదా కారణం ఏదైనా కావచ్చు.. బీర్ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ప్రస్తుతం ఎక్కువ మంది యువత సైతం బీర్‌(BEER)కు ప్రియులుగా మారిపోతున్నారు. దీంతో బీర్ ప్రియులను ఆకట్టుకోవడానికి తయారీ సంస్థలు కొత్త కొత్త ప్రయోగాలతో ముందుకు వస్తున్నాయి.

Alcohol flavours: బీర్ ప్రియులకు ఇక పండగే.. అందుబాటులోకి కొత్త ఫ్లేవర్లు..
Beer

నేను మద్యం తాగను.. కాని బీర్ తాగుతా అని చాలా మంది నోట వింటూ ఉంటాం. మద్యానికి వ్యసనం కాకపోయినా.. పని ఒత్తిడిలోంచి ఉపశమనం కోసం లేదా కారణం ఏదైనా కావచ్చు.. బీర్ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ప్రస్తుతం ఎక్కువ మంది యువత సైతం బీర్‌(BEER)కు ప్రియులుగా మారిపోతున్నారు. దీంతో బీర్ ప్రియులను ఆకట్టుకోవడానికి తయారీ సంస్థలు కొత్త కొత్త ప్రయోగాలతో ముందుకు వస్తున్నాయి. సాధారణంగా ఒకే రకమైన టేస్ట్‌ ఉన్న బీర్ తీసుకునే కొద్దీ దానిపై ఆసక్తి తగ్గుతూ ఉంటుంది. అందుకే బీర్ తాగేవాళ్లను ఆకట్టుకోవడానికి తయారీ సంస్థలు కొత్త కొత్త ఫ్లేవర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. భారత్‌కు చెందిన కొన్ని బీర్ కంపెనీలు స్థానికంగా ప్రజలు ఇష్టపడే ఫ్లేవర్స్‌తో బీర్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దీంతో ఎప్పుడూ ఒకే టేస్ట్ ఉండే బీర్స్ కాకుండా.. రకరకాల ఫ్లేవర్స్‌తో ఉండే బీర్‌లను తీసుకోవచ్చు.

Telangana: ఈ సమ్మర్‌లో బీరు ప్రియులకు కష్టమే..!


రుచి కోసం..

బీర్‌కు మంచి రుచిని జోడించడానికి తయారీ సంస్థలు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాయి. స్థానికంగా ప్రజలు ఎక్కువుగా ఇష్టపడే ఫ్లేవర్స్‌లో బీర్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇటీవల, స్వదేశీ క్రాఫ్ట్ బీర్ కంపెనీ బీరా 91 చట్నీ సోర్‌ను విడుదల చేసింది. పరిమిత సంఖ్యలో ఈ బీర్లను మార్కెట్లో విడుదల చేసింది. స్ట్రీట్ ఫుడ్స్‌లో ఎక్కువ మంది చట్నీని ఇష్టపడతారు. చట్నీ బాగుంటే టిఫిన్ ఎక్కువ లాగించేస్తారు. దీంతో చట్నీ ఫ్లేవర్‌లో బీర్స్ తయారు చేసింది బీరా 91 కంపెనీ. ఈ బీర్ తయారీకి చింతపండును ఉపయోగించారు. కొత్త ఫ్లేవర్స్‌లో బీర్‌లు తయారుచేసేందుకు బిరా 91 కంపెనీ అమెరికా కేంద్రంగా ఉన్న క్రాఫ్ట్ బ్రూవర్ న్యూ బెల్జియం బ్రూయింగ్‌తో కలిసి పనిచేస్తుంది. అమెరికాలోని కొలరాడో ప్రపంచంలోనే బీర్ల ఆవిష్కరణకు కేంద్రంగా ఉంది. అమెరికాలో అత్యంత పేరొందిన బీర్ల కంపెనీగా న్యూ బెల్జియం బ్రూయింగ్ సంస్థ ఉందని బిరా 91 వ్యవస్థాపకుడు, CEO అంకుర్ జైన్ తెలిపారు.


గతంలోనూ..

బిరా 91 వివిధ ఫ్లేవర్స్‌తో బీర్‌లను తయారుచేయడం ఇది మొదటిసారి కాదు. ఈ కంపెనీ 2022లో ' బాలీవుడ్ IPA', 'కోకుమ్ సోర్', 'బ్రౌన్ ఆలే' 'మ్యాంగో లస్సీ' అనే నాలుగు కొత్త రుచులతో బీర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా కాలానుగుణంగా లభించే పండ్లు, వివిధ రుచికరమైన పదార్థాలతో బీర్లను తయారుచేయడం ద్వారా విభిన్న రుచులతో కూడిన అల్కాహల్‌ను అందించాలనే ఉద్దేశంతో బీరా 91 సంస్థ ఓ ప్రయత్నం చేస్తోంది. ఈ బీర్లకు భారత్‌లో మంచి ఆదరణ లభిస్తోందని సంస్థ తెలిపింది.


కాఫీ ఫ్లేవర్స్

బీరా 91 పండ్లకు సంబంధించిన ఫ్లేవర్స్ మాత్రమే కాకుండా కాఫీ ప్లేవర్స్‌ కలిగిన బీర్లను తయారుచేస్తోంది. మలబార్‌ కొండల్లో లభించే కాఫీ పొడి, కొత్తిమీర గింజలతో రుచికరమైన బీర్లను ఈ సంస్థ తయారు చేసింది. బీరా 91తో పాటు మరో బీర్ల తయారీసంస్థ కాటి పతంగ్ సాఫ్రాన్ లాగర్, స్నాపీ వీట్, జెస్టీ అంబర్, బరేలీ బోల్డ్ అనే నాగులు బ్రాండ్లతో కూడిన బీర్లను తయారుచేస్తుంది. స్నాపీ వీట్ బీర్‌లో పెప్పర్ కార్న్ , కొత్తిమీర వంటి సేంద్రీయ భారతీయ మసాలా దినుసులను జోడించడం ద్వారా కొత్తరుచులు కలిగిన బీర్లను ఈ సంస్థ తయారుచేస్తోంది.


కొత్త ప్రయోగాలు

కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టడంతో భారతీయ బీర్ మార్కెట్ ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. ఇది మరింత విస్తరించేందుకు విస్తృత అవకాశాలున్నాయని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల కాలంలో మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఎక్స్‌పర్ట్ మార్కెట్ రీసెర్చ్ (EMR) నిర్వహించిన అధ్యయనం ప్రకారం, 2023లో భారతీయ బీర్ మార్కెట్ విలువ దాదాపు రూ. 483.10 బిలియన్‌లుగా ఉండగా.. దీని విలువ 2032 నాటికి సుమారు రూ. 1122.52 బిలియన్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది.

బ్రాండెడ్‌ బీర్లు దాచేస్తున్నారు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 15 , 2024 | 10:12 AM