Share News

Relationship: భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా సరే.. ఈ అలవాట్లుంటే వారి బంధం సేఫ్!

ABN , Publish Date - Apr 25 , 2024 | 10:39 AM

భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలకే కాదు.. పెద్ద గొడవలు వచ్చినా సరే.. వారి బంధం పదిలంగా ఉండాలంటే ఇద్దరిలో ఈ 5 అలవాట్లు ఉంటే చాలంటున్నారు రిలేషన్ షిప్ నిపుణులు. వైవాహిక బంధాన్ని పదిలంగా ఉంచే ఆ అలవాట్లు ఇవే..

Relationship:  భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా సరే.. ఈ అలవాట్లుంటే వారి బంధం సేఫ్!

ఈ మధ్యకాలంలో విడాకుల కేసులు ఎక్కువ అయ్యాయి. భార్యాభర్తలు ఒకరి విషయంలో మరొకరు ఫిర్యాదులు చేసుకుంటూ పెళ్లైన కొన్ని రోజులు, నెలల్లోపే విడిపోవడం జరుగుతోంది. ఒకరి విషయంలో మరొకరికి అవగాహన లేకపోవడమే కాదు.. ఇద్దరి మధ్య కొన్ని విషయాలలో కొన్ని అలవాట్లు లేకపోవడం కూడా దీనికి కారణం అవుతాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలకే కాదు.. పెద్ద గొడవలు వచ్చినా సరే.. వారి బంధం పదిలంగా ఉండాలంటే ఇద్దరిలో ఈ 5 అలవాట్లు ఉంటే చాలంటున్నారు రిలేషన్ షిప్ నిపుణులు. వైవాహిక బంధాన్ని పదిలంగా ఉంచే ఆ 5 అలవాట్లు ఏంటో తెలుసుకుంటే..

ఆలోచనలు..

ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉన్న జంటల మధ్య సంబంధం కూడా బలంగా ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ఆలోచనలతోనూ, వేర్వేరు అభిప్రాయాలతోనూ ఉంటారు. ఇద్దరి మధ్య కమ్యూూనికేషన్ బాలేకుంటే మనసులో ఉండే ఏ విషయాలను స్పష్టంగా పంచుకోలేరు, చెప్పుకోలేరు. ఇలాంటి సంబంధాలు ఎక్కువ కాలం ఉండవు. ఎందుకంటే కమ్యూనికేషన్ లేకపోవడం పరస్పర వివాదాలు, ఇద్దరి మధ్య గొడవ, అనుమానాలు, అసంతృప్తులకు కారణం అవుతుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలివీ..!


సమయం..

వివాహ బంధంలో ముడిపడిన తరువాత మొదట్లో ఉన్నంత సన్నిహితంగా ఆ తరువాత ఉండరు. మొదట్లో ఒకరికోసం ఒకరు సమయాన్ని కేటాయించినంత బాగా ఆ తరువాత కేటాయించుకోరు. చాలామంది కెరీర్ కోసం తప్పట్లేదు అనే సాకు చెబుతారు. కానీ పెళ్లై ఎన్నేళ్లు అయినా సరే ఒకరికోసం మరొకరు సమయం కేటాయించుకుంటూ ఉంటే వారిద్దరి మధ్య ఎంత పెద్ద గొడవలు జరిగినా అవన్నీ ఇట్టే సమసిపోతాయి.

అర్థం చేసుకోవడం..

ఒకరు చెప్పేది వినడం, అర్థం చేసుకోవడం గొప్ప గుణం. తాము చెప్పేది తమ భాగస్వామి అర్థం చేసుకుంటున్నారనే ఆలోచన వ్యక్తులను మానసిక ఆదోంళన నుండి ఊరట ఇస్తుంది. ఇలా అర్థం చేసుకునేవారు భాగస్వామి సమస్యలు కూడా అర్థం చేసుకుంటారు. పరిష్కారాలు కూడా సులువుగా లభిస్తాయి.

పొరపాటున కూడా ఫ్రిజ్ లో ఉంచకూడని పండ్లు ఇవీ..!


అంగీకారం..

ఏ వ్యక్తి సంపూర్ణుడు కాడు. తనకు తెలిసిందే కరెక్ట్ అనుకోవడం కూడా సమంజసం కాదు. ఏదైనా సంఘటన జరిగినా తను కరెక్టే అనే మూర్ఖత్వపు వాదన ఉండకూడదు. తను చేసింది తప్పైతే అది తప్పు అని ఒప్పుకునే స్వభావం ఉండాలి. అలా ఉన్న భాగస్వాముల మధ్య ఎంత పెద్ద గొడవలు వచ్చినా అవన్నీ తమ తమ తప్పులను అంగీకరించడం ద్వారా పెద్ద తగాదాలకు దారి తీయకుండా ఆపవచ్చు.

ప్రేమను వ్యక్తీకరించడం..

ఇద్దరు వ్యక్తుల మధ్య ఎంత గొడవ జరిగినా వారిని కలిపి ఉంచేది వారిద్దరి మధ్య ఉన్న ప్రేమే. అయితే ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే సరిపోదు. ఒకరి మీద మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేయడం వల్ల ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. చాలా వరకు ఈ ప్రేమే గొడవలు పెరగకుండా ఆపుతుంది.

పొరపాటున కూడా ఫ్రిజ్ లో ఉంచకూడని పండ్లు ఇవీ..!

తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలివీ..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 25 , 2024 | 10:39 AM