Share News

వినే్‌షపైనే అందరి దృష్టీ

ABN , Publish Date - Apr 19 , 2024 | 02:17 AM

సాధ్యమైనన్ని పారిస్‌ ఒలింపిక్‌ బెర్త్‌లు దక్కించుకోవడమే లక్ష్యంగా.. భారత రెజ్లర్లు ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ బరిలోకి దిగనున్నారు..

వినే్‌షపైనే అందరి దృష్టీ

ఆసియా రెజ్లింగ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ నేటి నుంచి

బిష్కెక్‌ (కిర్గిస్థాన్‌): సాధ్యమైనన్ని పారిస్‌ ఒలింపిక్‌ బెర్త్‌లు దక్కించుకోవడమే లక్ష్యంగా.. భారత రెజ్లర్లు ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ బరిలోకి దిగనున్నారు. శుక్రవారం నుంచి జరిగే టోర్నీలో ఫ్రీ స్టైల్‌, గ్రీకో-రోమన్‌ విభాగాల్లోని 18 వెయిట్‌ కేటగిరీల్లో 36 విశ్వక్రీడల బెర్త్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే, సుజీత్‌ కలాకర్‌ (65కి), దీపక్‌ పూనియా (86 కి) మినహా మిగతా 17 మంది భారత రెజ్లర్లు ఈపాటికే బిష్కెక్‌ చేరుకొన్నారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో దీపక్‌, సుజీత్‌లు దుబాయ్‌లోనే ఆగిపోయారు. దీంతో టోర్నీలో వీరు బరిలోకి దిగడంపై ఉత్కంఠ నెలకొంది. కాగా, ఇప్పటి వరకు 53 కిలోల విభాగంలో అంతిమ్‌ మాత్రమే ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇటీవలి కాలంలో వివాదాలతోనే హైలైట్‌ అయిన వినే్‌షపై అందరి దృష్టీ నెలకొంది. 50 కిలోల్లో బరిలోకి దిగుతున్న ఫొగట్‌.. ట్రయల్స్‌ సందర్భంగా చేసిన రచ్చ ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది.

Updated Date - Apr 19 , 2024 | 02:17 AM