Share News

రెండో స్థానానికి గుకేష్‌

ABN , Publish Date - Apr 17 , 2024 | 01:54 AM

క్యాండిడేట్స్‌ చెస్‌లో నెపోమ్నియాచి (రష్యా)తో జరిగిన పదో రౌండ్‌ గేమ్‌ను భారత జీఎం గుకేష్‌ డ్రా చేసుకున్నాడు. ఈ రౌండ్‌ అనంతరం ఇరువురు 6 పాయింట్లతో...

రెండో స్థానానికి గుకేష్‌

టొరొంటో: క్యాండిడేట్స్‌ చెస్‌లో నెపోమ్నియాచి (రష్యా)తో జరిగిన పదో రౌండ్‌ గేమ్‌ను భారత జీఎం గుకేష్‌ డ్రా చేసుకున్నాడు. ఈ రౌండ్‌ అనంతరం ఇరువురు 6 పాయింట్లతో సమానంగా నిలిచినా, మెరుగైన టైబ్రేక్‌ స్కోరుతో నెపో టాప్‌లో, గుకేష్‌ రెండో స్థానంలో ఉన్నారు. ప్రజ్ఞానంద-విదిత్‌, హంపి-టాన్‌ జాంగీ (చైనా) మధ్య గేమ్‌లు డ్రాగా ముగియగా, సాలిమోవా (బల్గేరియా) చేతిలో వైశాలి ఓటమిపాలైంది. ప్రజ్ఞానంద 5వ, విదిత్‌ 6వ స్థానంలో.. మహిళల్లో హంపి 5వ వైశాలి, 8వ స్థానాల్లో కొనసాగుతున్నారు.

Updated Date - Apr 17 , 2024 | 01:54 AM