Share News

పంత్‌ పటాకా

ABN , Publish Date - Apr 25 , 2024 | 03:16 AM

ఐపీఎల్‌లో ప్రతీ మ్యాచ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సాగుతూ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. 225 పరుగుల భారీ ఛేదనలోనూ గుజరాత్‌ టైటాన్స్‌ పట్టు వదలకుండా పోరాడి.. ఆఖరి బంతి వరకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు వణుకు పుట్టించింది...

పంత్‌ పటాకా

నేటి మ్యాచ్‌

హైదరాబాద్‌ X బెంగళూరు, రాత్రి

7.30 గం. , వేదిక: హైదరాబాద్‌

4 పరుగులతో ఢిల్లీ విజయం

రిషభ్‌, అక్షర్‌ అర్ధసెంచరీలు

పోరాడి ఓడిన గుజరాత్‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో ప్రతీ మ్యాచ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సాగుతూ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. 225 పరుగుల భారీ ఛేదనలోనూ గుజరాత్‌ టైటాన్స్‌ పట్టు వదలకుండా పోరాడి.. ఆఖరి బంతి వరకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు వణుకు పుట్టించింది. కానీ సిక్సర్‌ బాదితేనే విజయం దక్కే పరిస్థితిలో టైటాన్స్‌ తడబడడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ నాలుగు పరుగుల తేడాతో ఊపిరిపీల్చుకుంది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ (43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 88 నాటౌట్‌) విధ్వంసంతో ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగులు చేసింది. అక్షర్‌ పటేల్‌ (43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 66), స్టబ్స్‌ (7 బంతుల్లో 26 నాటౌట్‌) వేగంగా ఆడారు. సందీప్‌ వారియర్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఛేదనలో గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 220 పరుగులు చేసి ఓడింది. సుదర్శన్‌ (23 బంతుల్లో 65), మిల్లర్‌ (23 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 55) అర్ధసెంచరీలు చేయగా.. రషీద్‌ (21 నాటౌట్‌) ఆఖర్లో పోరాడాడు. రసిక్‌ సలామ్‌కు 3, కుల్దీ్‌పనకు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా పంత్‌ నిలిచాడు.


పోరాటం సరిపోలేదు..: భారీ ఛేదనలో గుజరాత్‌ అసమాన పోరాటాన్ని ప్రదర్శించింది. రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ గిల్‌ (6) వెనుదిరిగినా.. సాహా, సుదర్శన్‌, మిల్లర్‌, రషీద్‌ల బ్యాటింగ్‌ తీరుతో మ్యాచ్‌ ఇరువైపులా దోబూచులాడింది. కానీ చివర్లో అదృష్టం ఢిల్లీనే వరించింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయిసుదర్శన్‌, ఓపెనర్‌ సాహా ఆరంభంలో వేగంగా ఆడేస్తూ 49 బంతుల్లోనే రెండో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. పవర్‌ప్లేలో జట్టు 67/1 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. పదో ఓవర్‌లో సాహాను కుల్దీప్‌ అవుట్‌ చేయగా.. 29 బంతుల్లోనే సుదర్శన్‌ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ దశలో స్వల్ప వ్యవధిలోనే టైటాన్స్‌ వికెట్లను కోల్పోయింది. ఒమర్జాయ్‌ (1)ను అక్షర్‌ అవుట్‌ చేయగా.. పేసర్‌ రసిక్‌ వరుస ఓవర్లలో సుదర్శన్‌, షారుక్‌ (8)లను అవుట్‌చేసి షాకిచ్చాడు. దీనికి తోడు 16వ ఓవర్‌లో హిట్టర్‌ తెవాటియా (4)ను కుల్దీప్‌ పెవిలియన్‌కు చేర్చడంతో 152/6తో గుజరాత్‌ ఓటమి దిశగా పయనించింది. కానీ ఓవైపు క్రీజులో మిల్లర్‌ ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. దీనికి తగ్గట్టుగానే అతడు నోకియా (17వ) ఓవర్‌లో 4,6,6,6తో 24 రన్స్‌ రాబట్టడంతో ఢిల్లీపై ఒత్తిడి పెరిగింది. అలాగే 21 బంతుల్లోనే అతడి ఫిఫ్టీ కూడా పూర్తయ్యింది. ఈ స్థితిలో పేసర్‌ ముకేశ్‌ జట్టుకు రిలీ్‌ఫనిస్తూ మిల్లర్‌ను సాగనంపాడు. చివరి 12 బంతుల్లో 37 పరుగులు రావాల్సి ఉండడంతో సాయికిశోర్‌ (13) రెండు సిక్సర్లతో వణికించినా.. రసిక్‌ అతడిని బౌల్డ్‌ చేశాడు. సమీకరణం ఆరు బంతుల్లో 19 రన్స్‌కి మారడంతో రషీద్‌ 4,4,6తో గుబులు రేపాడు. అయినా ఆఖరి బంతికి సిక్సర్‌ రాకపోవడంతో ఢిల్లీ సంబరాల్లో మునిగిపోయింది.


పంత్‌-పటేల్‌ శతక భాగస్వామ్యం: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ పవర్‌ప్లేలోనే ఫ్రేజర్‌ (23), పృథ్వీ షా (11), హోప్‌ (5)ల వికెట్లను కోల్పోయింది. ఏడేళ్ల తర్వాత వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన అక్షర్‌ పటేల్‌ దుమ్మురేపారు. అలాగే డెత్‌ ఓవర్లలో పంత్‌ ధాటికి టైటాన్స్‌ బౌలర్లు పూర్తిగా గతి తప్పారు. వార్నర్‌ను బెంచీకే పరిమితం చేయడంతో షాకు జతగా ఫ్రేజర్‌ ఓపెనర్‌గా వచ్చాడు. స్కోరు 3 ఓవర్లలోనే 34కి చేరింది. కానీ పేసర్‌ సందీప్‌ వారియర్‌ గట్టి షాక్‌నిస్తూ నాలుగో ఓవర్‌లో ఫ్రేజర్‌, షాలను అవుట్‌ చేసి, తన తర్వాతి ఓవర్‌లోనే హోప్‌ను సైతం వెనక్కి పంపాడు. అయితే టైటాన్స్‌ సంతోషాన్ని ఆవిరి చేస్తూ పంత్‌-పటేల్‌ జోడీ మరో 11 ఓవర్లపాటు నిలకడగా క్రీజులో నిలిచింది. 12వ ఓవర్‌లోనే స్కోరు వంద దాటింది. 16వ ఓవర్‌లో పంత్‌ రెండు సిక్సర్లు బాదగా.. తర్వాతి ఓవర్‌లో అక్షర్‌ సైతం రెండు వరుస సిక్సర్లతో విరుచుకుపడినా స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌కు చిక్కాడు. దీంతో మూడో వికెట్‌కు 113 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. పంత్‌ 34 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన సమయంలో డీసీ స్కోరు 180 ఖాయంలా కనిపించింది. కానీ 19వ ఓవర్‌ స్పిన్నర్‌ సాయికిశోర్‌కు ఇవ్వడంతో స్టబ్స్‌ చెలరేగి 22 పరుగులు రాబట్టాడు. ఇక ఆఖరి ఓవర్‌లోనైతే పంత్‌ వీరంగం సృష్టిస్తూ.. 6,4,6,6,6తో ఏకంగా 31 పరుగులు రాబట్టడంతో ఢిల్లీ స్కోరు అవలీలగా 220 దాటేసింది. దీంతో టైటాన్స్‌ చివరి 12 బంతుల్లోనే 53 పరుగులిచ్చుకున్నట్టయ్యింది.

స్కోరుబోర్డు

ఢిల్లీ: పృధ్వీ షా (సి) నూర్‌ (బి) వారియర్‌ 11, ఫ్రేజర్‌ (సి) నూర్‌ (బి) వారియర్‌ 23, అక్షర్‌ (సి) కిషోర్‌ (బి) నూర్‌ 66, హోప్‌ (సి) రషీద్‌ (బి) వారియర్‌ 5, పంత్‌ (నాటౌట్‌) 88, స్టబ్స్‌ (నాటౌట్‌) 26, ఎక్స్‌ట్రాలు 5, మొత్తం: 20 ఓవర్లలో 224/4; వికెట్లపతనం : 1-35, 2-36, 3-44, 4-157; బౌలింగ్‌: అజ్మతుల్లా 4-0-33-0, సందీప్‌ వారియర్‌ 3-0-15-3, రషీద్‌ ఖాన్‌ 4-0-35-0, నూర్‌ అహ్మద్‌ 3-0-36-1, మోహిత్‌ 4-0-73-0, షారుఖ్‌ 1-0-8-0, సాయి కిషోర్‌ 1-0-22-0.


లఖ్‌నవూ: సాహా (సి) అక్షర్‌ (బి) కుల్దీప్‌ 39, గిల్‌ (సి) అక్షర్‌ (బి) నోకియా 6, సాయి సుదర్శన్‌ (సి) అక్షర్‌ (బి) రసిక్‌ 65, ఒమర్జాయ్‌ (సి) ఫ్రేజర్‌ (బి) అక్షర్‌ 1, మిల్లర్‌ (సి) రసిక్‌ (బి) ముకేష్‌ 55, షారుక్‌ (సి) పంత్‌ (బి) రసిక్‌ 8, తెవాటియా (సి) పంత్‌ (బి) కుల్దీప్‌ 4, రషీద్‌ ఖాన్‌ (నాటౌట్‌) 21, సాయి కిషోర్‌ (బి) రసిక్‌ 13, మోహిత్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు 8, మొత్తం: 20 ఓవర్లలో 220/8; వికెట్లపతనం: 1-13, 2-95, 3-98, 4-121, 5-139, 6-152, 7-181, 8-206; బౌలింగ్‌: ఖలీల్‌ 2-0-26-0, నోకియా 3-0-48-1, రసిక్‌ సలామ్‌ 4-0-44-3, ముకేష్‌ 4-0-41-1, అక్షర్‌ 3-0-28-1, కుల్దీప్‌ 4-0-29-2.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

రాజస్థాన్‌ 8 7 1 0 14 0.698

కోల్‌కతా 7 5 2 0 10 1.206

హైదరాబాద్‌ 7 5 2 0 10 0.914

లఖ్‌నవూ 8 5 3 0 10 0.148

చెన్నై 8 4 4 0 8 0.415

ఢిల్లీ 9 4 5 0 8 -0.386

గుజరాత్‌ 9 4 5 0 8 -0.974

ముంబై 8 3 5 0 6 -0.227

పంజాబ్‌ 8 2 6 0 4 -0.292

బెంగళూరు 8 1 7 0 2 -1.046

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

1

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక పరుగులిచ్చిన (0/73) బౌలర్‌గా మోహిత్‌ శర్మ

2

చివరి ఐదు ఓవర్లలో ఎక్కువ పరుగులు (97) సాధించిన రెండో జట్టుగా ఢిల్లీ. బెంగళూరు (112) ముందుంది.

Updated Date - Apr 25 , 2024 | 03:16 AM