Share News

టీ20 వరల్డ్‌కప్‌ అంబాసిడర్‌ బోల్ట్‌

ABN , Publish Date - Apr 25 , 2024 | 03:06 AM

టీ20 వరల్డ్‌క్‌పనకు స్ర్పింట్‌ కింగ్‌ ఉసేన్‌ బోల్ట్‌ ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ బుధవారం ప్రకటించింది...

టీ20 వరల్డ్‌కప్‌ అంబాసిడర్‌ బోల్ట్‌

దుబాయ్‌: టీ20 వరల్డ్‌క్‌పనకు స్ర్పింట్‌ కింగ్‌ ఉసేన్‌ బోల్ట్‌ ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ బుధవారం ప్రకటించింది. జూన్‌ ఒకటి నుంచి జరిగే పొట్టి కప్‌ను అమెరికా-వెస్టిండీస్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బోల్ట్‌కున్న క్రేజ్‌.. టోర్నీ పాపులారిటీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు ఐసీసీ తెలిపింది. ఉసేన్‌కు కూడా క్రికెట్‌ అంటే ప్రత్యేకమైన అభిమానం. వెస్టిండీస్‌ ఆటగాళ్లతో అతడికి మంచి సంబంధాలున్నాయి. వ్యక్తిగతంగా ఎంతో సరదాగా ఉండే బోల్ట్‌.. మరి ప్రచారకర్తగా అభిమానుల్లో ఎంతటి జోష్‌ నింపుతాడో చూడాలి.

Updated Date - Apr 25 , 2024 | 03:06 AM