Share News

వైభవంగా ఒలింపిక్‌ జ్యోతి ప్రజ్వలన

ABN , Publish Date - Apr 17 , 2024 | 01:56 AM

ఒలింపిక్స్‌ క్రీడల పుట్టినిల్లు గ్రీస్‌లోని ప్రాచీన ఒలింపియాలో.. పారిస్‌ విశ్వక్రీడాజ్యోతిని ప్రజ్వలన చేశారు. సంప్రదా యం ప్రకారం మతాధికారి పాత్రను...

వైభవంగా ఒలింపిక్‌ జ్యోతి ప్రజ్వలన

  • టార్చ్‌ రిలే ఆరంభం

  • 100 రోజుల కౌంట్‌డౌన్‌

ఒలింపియా (గ్రీస్‌): ఒలింపిక్స్‌ క్రీడల పుట్టినిల్లు గ్రీస్‌లోని ప్రాచీన ఒలింపియాలో.. పారిస్‌ విశ్వక్రీడాజ్యోతిని ప్రజ్వలన చేశారు. సంప్రదా యం ప్రకారం మతాధికారి పాత్రను పోషించిన గ్రీస్‌ నటి మేరీ మినా ఒలింపిక్‌ టార్చ్‌ను వెలిగించింది. మంగళవారం ఆకాశం మేఘావృతమై ఉండడంతో పారాబోలిక్‌ మిర్రర్‌ నుంచికాకుండా ముందు రోజు రిహార్సల్‌ సందర్భంగా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన అగ్ని నుంచి జ్యోతిని వెలిగించింది. తర్వాత ఈ జ్యోతిని తొలి టార్చ్‌ బేరర్‌గా వ్యవహరించిన టోక్యో క్రీడల స్వర్ణ విజేత అయిన గ్రీస్‌ రోయర్‌ స్టెఫనోస్‌ డౌస్కోకు అందించింది. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని వీక్షించడానికి భారీ సంఖ్యలో వీక్షకులు హాజరయ్యారు. కాగా 11 రోజులపాటు గ్రీస్‌లో ఒలింపిక్‌ టార్చ్‌ రిలే జరగనుంది. ఆ తర్వాత ఓడలో పారిస్‌కు పయనం కానుంది. అయితే, ఒలింపిక్స్‌ ఆరం భోత్సవాన్ని స్టేడియంలో కాకుండా సెస్‌ నదిలో నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహకాలు చేస్తున్నారు. కాగా జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఈ పోటీల 100 రోజుల కౌంట్‌డౌన్‌కు పారిస్‌ సిద్ధ మైంది. నేటినుంచి ఈ క్రీడలకు ఇంకా 100 రోజుల సమయం ఉంది.

Updated Date - Apr 17 , 2024 | 01:56 AM