Share News

నన్నెందుకు బ్లాక్‌ చేశారో..?

ABN , Publish Date - May 08 , 2024 | 03:56 AM

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఐపీఎల్‌ టైటిల్‌ అందించిన కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌. అయితే, ఆ తర్వాత ఫ్రాంచైజీతో అతడి సంబంధాలు బెడిసికొట్టాయి. ఈ క్రమంలో....

నన్నెందుకు బ్లాక్‌ చేశారో..?

న్యూఢిల్లీ: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఐపీఎల్‌ టైటిల్‌ అందించిన కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌. అయితే, ఆ తర్వాత ఫ్రాంచైజీతో అతడి సంబంధాలు బెడిసికొట్టాయి. ఈ క్రమంలో 2021లో సారథ్య బాధ్యతల నుంచి వార్నర్‌ను తప్పించిన ఫ్రాంచైజీ.. క్రమంగా అతడిని జట్టుకు కూడా దూరం చేసింది. ప్రస్తుతం వార్నర్‌ ఢిల్లీకి ఆడుతున్నాడు. అయితే, సన్‌రైజర్స్‌ యాజమాన్యం సోషల్‌ మీడియాలో తనను బ్లాక్‌ చేయడం తనను ఎంతో బాధించిందని ఓ యూట్యూబ్‌ చానెల్‌లో అశ్విన్‌తో జరిగిన చిట్‌చాట్‌లో వార్నర్‌ వాపోయాడు. అలా ఎందుకు చేశారో తనకు అర్థం కాలేదన్నాడు. కానీ, జట్టు అభిమానులు మాత్రం సోషల్‌ మీడియా ద్వారా తనతో ఇప్పటికీ మాట్లాడుతూనే ఉండ డం సంతోషంగా ఉందని వార్నర్‌ చెప్పాడు.

Updated Date - May 08 , 2024 | 03:56 AM