Share News

iPhone: ఐఫోన్ యూజర్లకు బంపరాఫర్.. 15 సిరీస్‌పై రూ.50వేల తగ్గింపు..

ABN , Publish Date - Apr 13 , 2024 | 08:56 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫ్లిప్‌కార్ట్ మెగా సేవింగ్ డేస్ సేల్ నడుస్తోంది. ఇది ఏప్రిల్ 15 వరకు కొనసాగనుంది.ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాలు మొదలైన గ్యాడ్జెట్లపై ఫ్లిప్‌కార్ట్ గణనీయమైన తగ్గింపులను చేసింది.

iPhone: ఐఫోన్ యూజర్లకు బంపరాఫర్.. 15 సిరీస్‌పై రూ.50వేల తగ్గింపు..

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫ్లిప్‌కార్ట్ మెగా సేవింగ్ డేస్ సేల్ నడుస్తోంది. ఇది ఏప్రిల్ 15 వరకు కొనసాగనుంది.ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాలు మొదలైన గ్యాడ్జెట్లపై ఫ్లిప్‌కార్ట్ గణనీయమైన తగ్గింపులను చేసింది. డిస్కౌంట్‌లతో పాటు, ప్లాట్‌ఫారమ్ అనేక ప్రసిద్ధ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఐఫోన్ 15 గురించే.

దీని అసలు ధర రూ. 79,900, యాపిల్ ఐ ఫోన్ 15 సిరీస్ ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతున్న iPhone మోడల్‌లలో ఒకటి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అత్యధికంగా అమ్ముడైన ఆపిల్ ఐఫోన్ 14 తర్వాత యాపిల్ ఐఫోన్ 15 ఉంది. 2023 సెప్టెంబర్ లో లాంచ్ అయిన యాపిల్ 15 సిరీస్ ప్రస్తుతం Flipkart సేల్‌లో Apple iPhone 14 కంటే తక్కువ ధరకే అందిస్తోంది. యాపిల్ ఐ ఫోన్ 15 సిరీస్ లాంచ్ చేసినప్పుడు 128GB స్టోరేజ్‌‌తో ధర రూ. 79,900 గా ఉంది.


అయితే ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ 14 వేల 999కి దక్కించుకోవాలంటే.. ఐఫోన్ ఎక్చేంఛ్ తోపాటు, సిటీ బ్యాంక్ ఈఎంఐ ఆఫర్స్ గరిష్ఠంగా పొందగలిగి ఉండాలి. పాత ఐఫోన్ ఎక్చేంఛ్ ధర ఆధారంగా గరిష్ఠంగా రూ. 51 వేల 500 డిస్కౌంట్ పొందవచ్చు. అప్పుడే ఐఫోన్ 15 ధర రూ. 14,499కి లభిస్తుంది.

Wi-Fi: వైఫై హ్యాకర్ల బారిన పడకుండా.. ఈ టిప్స్ అనుసరించండి

Apple iPhone 15 Apple 48MP కెమెరా 12MP సెకండరీ సెన్సార్‌తో సపోర్ట్ చేస్తుంది.ఆకట్టుకునే డిస్‌ప్లే, వేగవంతమైన చిప్, మెరుగైన కెమెరా సిస్టమ్, కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ల ప్రపంచలో ది బెస్ట్ ఛాయిస్ గా ఐఫోన్ 15 నిలుస్తుంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 13 , 2024 | 08:56 PM