Share News

Kumaram Bheem Asifabad : బాల్య వివాహాలు, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

ABN , Publish Date - Apr 26 , 2024 | 10:15 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 26: మండలంలోని చిలాటిగూడ గ్రామంలో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధిహామీ కూలీలకు బాల్య వివాహాలు, ఆర్థికఅక్షరాస్యతపై అవగాహన కల్పించారు.

Kumaram Bheem Asifabad :  బాల్య వివాహాలు, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 26: మండలంలోని చిలాటిగూడ గ్రామంలో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధిహామీ కూలీలకు బాల్య వివాహాలు, ఆర్థికఅక్షరాస్యతపై అవగాహన కల్పించారు. బాల్యవివాహల పట్ల అందరికీ అవగాహన ఉండాలన్నారు. అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తరువాతనే వివాహం చేయాలన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరగితే 1098నెంబర్‌కి ఫోన్‌చేసి తెలియజేయాలన్నారు. గృహ హింసకు గురైతే 181కి ఫోన్‌ చేయాలన్నారు. 10సంవత్సరాల లోపు ఆడపిల్లల భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన స్కీం చాలా ఉపయోగపడు తుంద న్నారు. అదేవిధంగా సురక్ష భీమాయోజన, జీవనజ్యోతి బీమాయోజన అటల్‌ పెన్షన్‌ యోజన అందరు కట్టుకోవాలని చెప్పారు. అలాగే వడదెబ్బ తగిలితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. కార్యక్రమంలో మహిళా సాధి కారకేంద్రం సిబ్బంది జెండర్‌ స్పెషలిస్టు రాణి, రాజేశ్వరి, సాగర్‌, సుమలత, సంక్షేమా ధికారి మధుకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 10:15 PM