Share News

Kumaram Bheem Asifabad: మూడు కుటుంబాల్లో విషాదం

ABN , Publish Date - Apr 26 , 2024 | 10:17 PM

బెజ్జూరు, ఏప్రిల్‌ 26: ఒకరేమో బంధువుల ఇంట్లో కేశఖండనం ఉందని...మరొకరేమో పెళ్లి రిసెప్షన్‌ కోసం సంతోషంగా బయలుదేరారు. ఇంత లోనే ఊహించని రీతిలో విధి వెక్కిరించి రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించడంతో ముగ్గురి ప్రాణాలు బలిగొన్నాయి.

 Kumaram Bheem Asifabad: మూడు కుటుంబాల్లో విషాదం

- గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

- మరో ఇద్దరికి తీవ్రగాయాలు

బెజ్జూరు, ఏప్రిల్‌ 26: ఒకరేమో బంధువుల ఇంట్లో కేశఖండనం ఉందని...మరొకరేమో పెళ్లి రిసెప్షన్‌ కోసం సంతోషంగా బయలుదేరారు. ఇంత లోనే ఊహించని రీతిలో విధి వెక్కిరించి రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించడంతో ముగ్గురి ప్రాణాలు బలిగొన్నాయి. దీంతో మూడు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే బెజ్జూరు మండలంలోని కోర్తే గూడ-పోతేపల్లి గ్రామాల మధ్య గురువారం అర్ధ రాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడి కక్కడే మృత్యువాత పడగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎల్క పల్లి గ్రామానికి చెందిన దున్న నరసింహతో పాటు శనిగరం రాజ్‌కుమార్‌, ఆయిల్ల నిఖిల్‌ ఒక బైక్‌పై పోతేపల్లిలో బంధువుల ఇంట్లో జరిగిన పెళ్లి రిసె ప్షన్‌ కోసం వెళ్తున్నారు. బారేగూడ గ్రామానికి చెందిన తొర్రెం వెంగళ రావు, అర్కగూడ గ్రామానికి చెందిన ఆత్రం మహేష్‌ మరో బైక్‌పై బూరుగు గూడలో కేశఖండనానికి వస్తున్నారు. వీరు వస్తున్న రెండు బైక్‌లు కోర్తెగూడ సమీపంలో అతివేగంతో ఎదురెదురుగా బలంగా డీకొన్నాయి. దీంతో నర సింహ(20), మహేష్‌(26), వెంగళరావు(30) అక్కడి క్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో నిఖిల్‌, రాజ్‌ కుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసు కున్న కౌటాల సీఐ సాదిక్‌పాషా, ఎస్సై విక్రమ్‌ సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ క్షత గాత్రులను వైద్యం కోసం కాగజ్‌ నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలిం చారు. ఇందులో నిఖి ల్‌ పరిస్థితి విష మంగా ఉండ టంతో మంచి ర్యాలకు తరలిం చారు.

అతివేగమే ప్రమాదానికి కారణమా?

అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాద దృశ్యాన్ని చూస్తే అతివేగమే కారణమని తెలుస్తోంది. అతివేగంతో పాటు నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడంతోనే ముగ్గురి ప్రాణాలు బలైపోయాయి. వారు వస్తున్న వేగానికి బైక్‌లపై ప్రయాణి స్తున్న వారంతా తలా ఒకచోట ఎగిరిపడ్డారు. కుకుడ- బారేగూడ గ్రామాల మధ్య గతేడాదే డబుల్‌ రోడ్డు పనులు పూర్తిచేశారు. రోడ్డు బాగుండటంతో ఈ మార్గం గుండా వాహన దారులు ఇష్టారాజ్యంగా డ్రైవింగ్‌ చేస్తున్నారు. రోడ్డుపై ఎక్కడా కూడా ప్రమాద సూచికలు, స్పీడ్‌ బ్రేకర్లు లేనికారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

శోకసంద్రంలో కుటుంబాలు..

మండలంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా వారికుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. ఇంటిపెద్దలు మృతిచెందగా వారి కుటుంబసభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించాయి. అందివచ్చిన కొడుకు ఒకరైతే మరో ఇద్దరు ఇంటిపెద్దలు కావడంతో వారు రోది స్తున్న తీరు వర్ణనాతీతం. ఆత్రం మహేష్‌కు భార్య సరితతోపాటు ఒకకుమారుడు ఉన్నాడు. వెంగళ రావుకు భార్య అనితతోపాటు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వారి పిల్లలు తమ తండ్రి ఎక్కడ ఉన్నాడంటూ రోదిస్తుండగా పలువురి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

Updated Date - Apr 26 , 2024 | 10:17 PM