Share News

ట్యాపింగ్‌ కేసు నిందితులకు బెయిల్‌ నిరాకరణ

ABN , Publish Date - Apr 27 , 2024 | 05:21 AM

సంచలనం సృష్టించిన ఎస్‌ఐబీ ప్రధాన కార్యాలయంలో హార్డ్‌డి్‌స్కల ధ్వంసం, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ట్యాపింగ్‌ కేసు నిందితులకు బెయిల్‌ నిరాకరణ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి):

సంచలనం సృష్టించిన ఎస్‌ఐబీ ప్రధాన కార్యాలయంలో హార్డ్‌డి్‌స్కల ధ్వంసం, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న నిందితులు ప్రణీత్‌ రావు, భుజంగరావు, తిరుపతన్నల బెయిల్‌ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.

ఈ కేసులో పోలీస్‌ కస్టడీ ముగిసినందున బెయిల్‌ మంజూరు చేయాలని నిందితులు కోర్టును ఆశ్రయించారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ కేసులో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని.. ఈసమయంలో వీరికి బెయిల్‌ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని దర్యాప్తు అధికారుల తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి దర్యాప్తు అధికారుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని నిందితుల బెయిల్‌ పిటిషన్లను కొట్టివేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు.

కాగా ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఉన్న టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్‌రావు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన న్యాయమూర్తి తదుపరి విచారణ 29కి వాయిదా వేశారు.

Updated Date - Apr 27 , 2024 | 10:06 AM