Share News

ఉద్యోగులపై ఈసీ నజర్‌

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:14 AM

పార్లమెంట్‌ ఎన్నికల సందర్బంగా ఎలక్షన్‌ కమిషన్‌ ఉద్యోగులపై కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేసింది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రస్తుతం ఎన్నికల సీజన్‌ జోరందుకుంది

ఉద్యోగులపై ఈసీ నజర్‌

- నియమావళి ఉల్లంఘిస్తే కొలువుకు ఉద్వాసనే..

- సోషల్‌ మీడియాలపై సైతం కన్ను

జగిత్యాల, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ ఎన్నికల సందర్బంగా ఎలక్షన్‌ కమిషన్‌ ఉద్యోగులపై కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేసింది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రస్తుతం ఎన్నికల సీజన్‌ జోరందుకుంది. నేతలు ప్రచారంలో హోరెత్తిస్తుంటే...ఎన్నికల సంఘం త మ విధుల్లో బిజీగా ఉంది. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసు కుంటున్న ఈసీ...ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులపై సైతం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

ఎన్నికల్లో ఉద్యోగులది కీలక పాత్ర...

ఎన్నికల్లో ఉద్యోగులది కీలక పాత్ర ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వ్యక్తిగత సోషల్‌ మీడియా అకౌంట్స్‌పై ఎన్ని కల కమిషన్‌ నిఘా పెట్టింది. వారు ఉపయోగించే వాట్సప్‌ గ్రూపులు, ఫేస్‌ బుక్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ ఖాతాలను ప్రత్యేక బృందాలతో పరిశీలిస్తోంది. గతంలో జరిగిన ఎన్నికల సందర్బంగా ఆరోపణలు ఉన్న వారిపై అనుమానిత ఉద్యోగులపై మరింత ఫోకస్‌ పెట్టినట్లు సమాచా రం. ఓ నేతకు గానీ, ఓ పార్టీకి గానీ అనుకూలంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినా...వాటిని ఫార్వర్డ్‌ చేసినా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినట్లుగానే పరిగణిస్తున్నారు. ఆరోపణలు వచ్చిన ఉద్యోగి ఫోన్‌ కాల్‌ డేటాను కూడా పరిశీలించే అవకాశం సైతం లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆధారాలతో ఫిర్యాదు వస్తే చర్యలు...

జిల్లా వ్యాప్తంగా సుమారు 4 వేల మంది ఉపాధ్యాయులు, ఉద్యోగు లున్నారు. వీళ్లలో దాదాపు 90 శాతం ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఉ ద్యోగుల్లో నాల్గవ శ్రేణి తప్ప అందరికీ ఎన్నికల విదులు తప్పనిసరిగా ఉం టుంటాయి. కలెక్టర్‌ ఆధ్వర్యంలో వాళ్లంతా పనిచేస్తుంటారు. ప్రస్తుతం పా ర్లమెంట్‌ ఎన్నికల క్రమంలో వీరికి ప్రత్యేక నియమావళిని ఎన్నికల కమి షనర్‌ జారీ చేసింది. రాజకీయ నేతలతో ఎలాంటి సంబంధాలు ఉండ కూడదని అందులో స్పష్టం చేసింది. ప్రతి రాజకీయ నేత సమావేశం వీడి యో చిత్రీకరణ ఉంటుందని...ఇందులో ఉద్యోగులు ఉన్నట్లు తెలిసినా.. నే తలతో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలతో ఫిర్యాదు వచ్చినా తక్షణమే సస్పెన్షన్‌ తప్పదని స్పష్టం చేసింది.

హద్దు మీరితే అంతే సంగతులు...

ఎన్నికల కోడ్‌లో ఉద్యోగులకు ప్రత్యేక నిబంధన ఉన్నప్పటికీ కొందరు వాటిని పట్టించుకోవడం లేదు. జగిత్యాల జిల్లాలో ఇటీవల పలువురు ఉ ద్యోగులను అధికారులు సస్పెన్షన్‌ చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగు లు రాజకీయ పార్టీలకు ప్రచారం చేయరాదనే నిబంధనలు 1949 సెప్టెం బరు 17వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ కార్పొరేషన్‌, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే అన్ని స్థాయి లు, కేటగిరీల ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో పారదర్శకంగా వ్యవహరించా ల్సి ఉంటుంది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి అధికారి, ఉ ద్యోగి తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. హ ద్దు మీరితే సదరు ఉద్యోగికి ఉద్వాసన తప్పని పరిస్థితి ఉంటుందని ఉన్న తాధికారులు సూచిస్తున్నారు.

తప్పించుకోలేకుండా నిఘా..

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుంచి వీడి యో సర్వే లైన్స్‌, స్టాటిస్టికల్‌ సర్వే లైన్స్‌ బందాల నియామక ప్రక్రియ పూ ర్తవగా సభ్యులు ఇప్పటికే నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సంబంధించిన సభలు, సమావేశాలను అధికారులు చిత్రీకరిస్తున్నారు. వీటిని ప్రత్యేక బృందం వీక్షిస్తోంది. ఉద్యోగులు పాల్గొన్నట్లు దృష్టికి వచ్చినా, ఎవరి నుం చైనా ఫిర్యాదు వచ్చినా సంజాయిషీ నోటీసు జారీ చేస్తారు. ఉల్లంఘించి నట్లు తేలితే సస్పెన్షన్‌ వేటు వేస్తారు.

సామాజిక మాధ్యమాలపై...

సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, మీడియాలో వచ్చే వార్తలను పరిశీ లించేందుకు ప్రత్యేకంగా మీడియా మానిటరింగ్‌ బృందాన్ని కలెక్టర్‌ కార్యా లయంలో ఏర్పాటు చేశారు. ఉద్యోగులు వాట్సప్‌ గ్రూపులు, ఫేస్‌ బుక్‌, ఎక్స్‌ ఖాతాల్లో రాజకీయ పార్టీలకు అనుకూలంగా, వ్యతిరేకంగా పోస్టులు పెడితే మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారు. సామాజిక మాధ్యమాల ఖాతాలపై ఈసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది.

ఇవీ తప్పే...

ఉద్యోగులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక అభ్యర్థికి సహకరిస్తు న్నారనే చిన్నపాటి ఆధారాలు దొరికినావేటు పడుతుంది. తన కింది స్థా యి సిబ్బందిని పై అధికారి అధికార దర్పంతో ఒక పార్టీకి సహకరించా లని, ఫలానా పార్టీకి ఓటేయాలని చెపితే ఈసీ చర్యలు తీసుకునే అవ కాశం ఉంది. ప్రధానంగా ప్రచార సభల్లో పాల్గొనడం, తమ కులం నేత లని ప్రచారం చేయడాన్ని కూడా తీవ్రంగానే పరిగణిస్తారు. ఉద్యోగులు త మ సొంత ఊళ్లలోనూ కండువా వేసుకొని ప్రచారం చేయడం, రెచ్చ గొట్టే విధంగా మాట్లాడడం చేసిన వేటు వేసే అవకాశాలున్నాయి. ఈ తరు ణంలో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని, నిర్లక్ష్యం గా వ్యవహరిస్తే కొలువలకు ఎసరు వస్తుందని గుర్తుంచుకోవాలని పలు వురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు సూచిస్తున్నారు.

ఇటీవల వివాదాస్పద సంఘటనలు కొన్ని..

జిల్లాలో పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా ఉద్యోగులు వ్యవహరించిన వివాదాస్పద సంఘటనలు చర్చకు వస్తున్నాయి. మల్యాల మండలంలో పనిచేస్తున్న జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం సారంగపూర్‌ మండలం రేచపల్లి మ్యాడారం తండాకు చెందిన ఓ ఫాక్స్‌ ఉద్యోగి అధికార కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోవడంతో ఓ ప్రజాప్రతినిధి చేసిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం అధికారులు విచారణ జరిపి సస్పెన్షన్‌ వేటు వేశారు. అదేవిధంగా సారంగపూర్‌ మండలం రంగపేటకు చెందిన ఓ ఐకేపీ ఉద్యో గి సైతం అధికార కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోవడం వివాదాస్పద మైంది. ఈ సంఘటనపై సైతం అధికారులు నోటీసులు జారీ చేసి విచా రణ అనంతరం సస్పెన్షన్‌ చేసినట్లు ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. అదేవిధంగా జగిత్యాల మున్సిపల్‌కు చెందిన ఓ కాంట్రాక్టు ఉద్యోగి నిజా మాబాద్‌ పార్లమెంట్‌ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థితో ఓ సందర్బం గా కలిసిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది. ఉద్యో గుల వివాదాస్పద అంశాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. విచార ణలో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.

Updated Date - Apr 20 , 2024 | 01:14 AM