Share News

ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:18 AM

జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ఇంటర్‌ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 64.29 శాతం, ప్రథమ సంవత్సరంలో 51.69 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ద్వితీయ సంవత్సరంలో బాలికలు 3,376 మంది పరీక్షలకు హాజరుకాగా 2,481 మంది 73.49 శాతం ఉత్తీర్ణత కాగా, బాలురు 2,365 మంది హాజరుకాగా 1,210 మంది 51.16 శాతం ఉత్తీర్ణులయ్యారు.

ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి

- 73.49 బాలికల ఉత్తీర్ణత... బాలురు 51.16 శాతం

- ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 64.29 శాతం ఉత్తీర్ణత

- ప్రథమ సంవత్సరంలో 51.69 శాతం

జగిత్యాల, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ఇంటర్‌ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 64.29 శాతం, ప్రథమ సంవత్సరంలో 51.69 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ద్వితీయ సంవత్సరంలో బాలికలు 3,376 మంది పరీక్షలకు హాజరుకాగా 2,481 మంది 73.49 శాతం ఉత్తీర్ణత కాగా, బాలురు 2,365 మంది హాజరుకాగా 1,210 మంది 51.16 శాతం ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 3,284 మంది పరీక్షలకు హాజరుకాగా 2,079 మంది 63.31 శాతం ఉత్తీర్ణత కాగా, బాలురు 2,433 మంది హాజరుకాగా 876 మంది 36 శాతం ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ఒకేషనల్‌లో 55.89 శాతం ఉత్తీర్ణత లభించగా ఇందులో బాలురు 42.7 శాతం, బాలికలు 77.06 శాతం ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరం ఒకేషనల్‌లో 44.15 శాతం ఉత్తీర్ణత లభించగా ఇందులో బాలురు 30.37 శాతం, బాలికలు 64.25 శాతం ఉత్తీర్ణులయినట్లు జిల్లా ఇంటర్‌ విద్య నోడల్‌ అధికారి నారాయణ తెలిపారు.

ఫ అల్ఫోర్స్‌ జూనియర్‌ కళాశాలలో...

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో అల్ఫోర్స్‌ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గానూ విర్నత్‌ 467, శ్రీపతి సిద్ధార్థ 467, కృష్నవేని 467, లహరిక 467, నిషిత 467, బార్గవి 467, సాయి 466 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో 440 మార్కులకు గానూ నగునూరి హర్షిత 437, టబసుమ్‌ 436, సీఈసీ విభాగంలో 500 మార్కులకు గానూ శివచన్‌ 490 మార్కులు సాధించారు. అదేవిదంగా ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో అన్విత 990, కీర్తిరెడ్డి 988, ముస్కాన్‌ మోహిక్‌ 988, రవి 987, రమ్య 987, సమన్విత 987, గాయాత్రి 986, లావన్య 986 మార్కులు, బైపీసీ విభాగంలో సార్వాని 979, సీఈసీ విభాగంలో నజీర్‌ 976 ఆమర్కులు సాధించారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు అల్ఫోర్స్‌ అధినేత డాక్టర్‌ వి నరేందర్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌, ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఫ నవ్య బాలికల జూనియర్‌ కళాశాలలో...

పట్టణంలోని నవ్య బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఎంపీసీ సెకండ్‌ ఇయర్‌లో శాలిని 990 మార్కులు, మాదురి 989 మార్కులు, బైపీసీ ఫస్ట్‌ ఇయర్‌లో హాసిని 435 మార్కులు, సీఈసీ ఫస్ట్‌ ఇయర్‌లో సాత్విక 463 మార్కులు సాధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషా, కళాశాల కరస్పాండెంట్‌ శ్రీపాద నరేశ్‌, ప్రిన్సిపాల్‌ ఈశ్వర్‌, కళాశాల అధ్యాపకులు అభినందించారు.

ఫ ఆర్‌కే అండ్‌ ఎన్‌ఎస్‌వీ కళాశాలలో...

పట్టణంలోని ఆర్‌కే అండ్‌ ఎన్‌ఎస్‌వీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు. ఎంపీసీ విభాగంలో అక్షయ 465 మారుకలు, సహేర 465, రయాన్‌ ఖాన్‌, 464, ఉమామహి 988 మార్కులు, బైపీసీలో ఐమాన్‌ బూతుల్‌ 986 మార్కులు, నాగజ్యోతి 984, మదాని 978 మార్కులు సాధించగా ఆర్‌కే అండ్‌ ఎన్‌ఎస్‌వీ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్సిట్యూషన్స్‌ చైర్మన్‌ యాద రామకృష్ణ, ప్రిన్సిపాల్‌ పల్లెర్ల నరేశ్‌లు అభినందించారు.

ఫ శ్రీచైతన్య కళాశాలలో...

పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఇంటర్‌ ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. ద్వితీయ సంవత్సరం బైపీసీ విభాగంలో ముసిపట్ల శ్రీనిధి 991 మార్కులు, ఎంపీసీలో తాటిపల్లి హాసిని 991, సీఈసీలో సుస్మిత 975, ఎంఈసీలో తరునేష్‌ 975 మార్కులు సాధించారు. ఫస్ట్‌ ఇయర్‌ ఎంపీసీలో అస్లమ్‌ 467, సీఈసీలో సాయికుమార్‌ 482, ఎంఈసీలో హర్షిణి 483 మార్కులు సాధించగా విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్‌ ముసిపట్ల రాజేందర్‌, డైరెక్టర్‌ నేరెళ్ల మల్లేశం గౌడ్‌, అధ్యాపకులు వేణు తదితరులు అభినందించారు.

ఫ ఎంపీసీ విభాగంలో ఇర్ఫా యాసిన్‌ రాష్ట్ర స్థాయి ప్రతిభ..

పట్టణంలోని ఇస్లాంపురకు చెందిన షబానా అర్జూ-షేక్‌ యాసిన్‌ కుమార్తె ఇర్ఫా యాసిన్‌ హైద్రాబాద్‌లోని కూకట్‌పల్లిలో గల శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. ఇంటర్‌ ఎంపీసీ ఫస్ట్‌ ఇయర్‌ విభాగంలో 470 మార్కులకు గానూ 467 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ పలువురు అభినందించారు.

ఫ బైపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో శ్రీణిత ప్రతిభ...

జిల్లా కేంద్రానికి చెందిన బొడ్డుపల్లి శ్రీణిత ఇంటర్‌ ఫలితాల్లో బైపీసీ ప్రథమ సంవత్సరం విభాగంలో 438 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచింది. పట్టణంలోని బొడ్డుపల్లి అంజయ్య, సుదారాణి దంపతులు కుమార్తె శ్రీణిత హైద్రాబాద్‌లోని వశిష్ట కళాశాలలో చదువుతోంది. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన శ్రీణితను కళాశాల చైర్మన్‌ ప్రమీళ, డీన్‌ నళిని, ప్రిన్సిపాల్‌ స్వాతి, జగిత్యాల ట్రస్మా జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రావు, రజితారావు, హరిచరణ్‌ తదితరులు అభినందించారు.

ఫ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో...

పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు ఇంటర్‌ ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. ఇంగ్లీష్‌ మీడియంలో ద్వితీయ సంవత్సరం సీఈసీ విభాగంలో సామా మహినాజ్‌ 951 మార్కులు, షారీఫ్‌ ఉన్నీసా 943, ప్రథమ సంవత్సరం సీఈసీ విభాగంలో సామా మహినాజ్‌ 482 మార్కులు, మానుపాటి వర్ష 482 మార్కులు సాధించి ప్రతిభ కనబరచగా విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్‌ అలియా మక్సూద్‌, అధ్యాపకులు కొట్టాల తిరుపతి రెడ్డి తదితరులు అభినందించారు.

Updated Date - Apr 25 , 2024 | 01:18 AM