Share News

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:14 AM

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. మండలంలోని అల్లీపూర్‌లో గల డీసీఎంఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలకు ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్ల ద్వారా శుద్ధి చేసి ప్రభుత్వం సూచించిన విధంగా తూకం వేయాలన్నారు.

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
కొనుగోలు కేంద్రంలో సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

రాయికల్‌, ఏప్రిల్‌ 24: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. మండలంలోని అల్లీపూర్‌లో గల డీసీఎంఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలకు ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్ల ద్వారా శుద్ధి చేసి ప్రభుత్వం సూచించిన విధంగా తూకం వేయాలన్నారు. కొన్ని ధాన్యం కుప్పలు మ్యాచర్‌ వచ్చినా ఇంకా ఎందుకు తూకం వేయలేదని ప్రశ్నించారు. మ్యాచర్‌ యత్రం, తూకం వేసే యంత్రం ఎందుకు సర్టిఫై చేయించలేదని ప్రశ్నించారు. జిల్లావ్యాప్తంగా 426 కొనుగోలు కేంద్రాలు ఉండగా, 258 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించామన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 32,250.240 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. యాసంగి సీజన్‌లో ఈరోజు వరకు 522 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని, ఈ యాసంగిలో ఎక్కువగా కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రాల్లో ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నందున నీడ, మంచినీరు, తాత్కాలిక మరుగుదొడ్లు సమకూర్చుకోవాలన్నారు. విద్యుత్‌ సరఫరా, ఆన్‌లైన్‌ వసతి ఉండాలన్నారు. ఈ యాసంగిలో కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం అకాల వర్షాల కారణంగా పాడవకుండా ప్రతీ కొనుగోలు కేంద్రాల వారు, రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఫ ‘రైతుమిత్ర’ కార్యాలయం ప్రారంభం

అల్లీపూర్‌ గ్రామంలో అల్లీపూర్‌ రైతుమిత్ర ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా ప్రారంభించారు. రైతులను సంఘటితం చేసి రైతులకు లాభసాటి వ్యవసాయాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో ఈ కంపెనీని ప్రారంభించినట్లు తెలిపారు. ఇక్కడ రైతులకు తక్కువ ధరకే ఫర్టిలైజర్స్‌, బిస్కెట్లు అందించబడుతాయని పేర్కొన్నారు. ఈ కంపెనీ అల్లీపూర్‌ చుట్టుపక్కల ఉన్న ఆరు గ్రామాలను కవర్‌ చేస్తుందన్నారు. సభ్యులు వ్యవసాయాన్ని సృజనాత్మకంగా, విజ్ఞానాన్ని ఉపయోగిస్తూ లేటెస్ట్‌ టెక్నాలజీ, ఆధునిక పరిజ్ఞానం వాడుతూ అదనంగా లాభాలను అర్జించాలని సూచించారు. వ్యవసాయ అధికారులు, బ్యాంక్‌ సిబ్బంది, శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని అన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌పీవో అధ్యక్షుడు శంకర్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ వెంకట్‌ రెడ్డి, నాబార్డు ఈడీ మనోహర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి వాణి, పొలాస పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రజనీ దేవి, టీజీబీ బ్యాంక్‌ మేనేజర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 01:14 AM