Share News

వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలా చర్యలు

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:58 AM

చట్టాన్ని చుట్టంలా చేసుకొని మర్డర్లు చేసి తిరుగుతున్నా రని, చట్టం ఎవరికి చుట్టం కాదని, వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుం టామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు.

వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలా చర్యలు

కమాన్‌పూర్‌, ఏప్రిల్‌ 24 : చట్టాన్ని చుట్టంలా చేసుకొని మర్డర్లు చేసి తిరుగుతున్నా రని, చట్టం ఎవరికి చుట్టం కాదని, వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుం టామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడితో పాటు నాయకులు కాంగ్రెస్‌లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అవినీతిమాయంగా మారిందన్నారు. ఆ డబ్బులతో రాష్ట్ర వ్యాప్తంగా అందరికి రేషన్‌ కార్డులు, డబుల్‌ బెడ్రూం ఇళ్లు అనేక సంక్షేమ పథకాలు వచ్చేవ న్నారు. ఓడేడ్‌ బ్రిడ్జి కూలిపోయిందని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తూ కమి షన్‌లకు కక్కుర్తి పడుతున్న వైనాన్ని వెలికితీ స్తామని, ఎవరిని వదలమన్నారు. కాగా, మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ ఆవరణలో బీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, నాయకులు గడప కృష్ణమూర్తి, పిల్లి చంద్రశేఖర్‌, సుతారి రాజేందర్‌, నీల రాజయ్య, నక్క శంకర్‌, కాస రవిలతో పాటు పలువురు కాం గ్రెస్‌లో చేరగా వారికి మంత్రి శ్రీధర్‌బాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అలాగే మండల కేంద్రంలో ఛత్రపతి శివాజి యువసేన ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని మంత్రి శ్రీ ధర్‌బాబు ప్రారంభించారు. అనంతరం యువసేన సభ్యులను సత్కరించారు. యువసేన అధ్యక్షుడు జంగపల్లి సతీష్‌, మల్యాల నరేష్‌, చైతన్య, సాయి, సంతోష్‌, చందు, రాజు, సాయిలు ఉన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:58 AM