Share News

14మంది అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు తిరస్కరణ

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:50 PM

పెద్దపల్లి పార్లమెంటు నియోజక వర్గానికి దాఖలైన నామినేషన్లలో 14 మంది అభ్యర్థుల 24నామినేషన్‌ ప త్రాలను తిరస్కరించారు.

14మంది అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు తిరస్కరణ

పెద్దపల్లి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి పార్లమెంటు నియోజక వర్గానికి దాఖలైన నామినేషన్లలో 14 మంది అభ్యర్థుల 24నామినేషన్‌ ప త్రాలను తిరస్కరించారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి పెద్దప ల్లి పార్లమెంట్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ నామినేషన్లు దాఖలు చేసిన వారి సమక్షంలో పత్రాలను పరిశీలించారు. ఏప్రిల్‌ 18నుంచి ఏప్రిల్‌ 25వరకు నామినేషన్లు స్వీకరించారు. ఈ సంద ర్భంగా 63మంది అభ్యర్థులు 109 సెట్ల నామినేషన్‌ పత్రాలు సమర్పించా రు. వాటిని నామినేషన్లు సమర్పించిన అభ్యర్థుల సమక్షంలో పరిశీలించా రు. 63మంది అభ్యర్థులు 109 నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఇందులో 14మంది అభ్యర్థులకు సంబంధించిన 24నామినేషన్‌ పత్రాలు నిబంధనల ప్రకారం లేనందున వాటిని ఎన్నికల అధికారి తిరస్కరించా రు. భారత ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన నిబంధనల ప్రకారం అన్ని వివ రాలు పూర్తిగా సమర్పించిన 49 మంది అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను ఆమోదించామని పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ము జమ్మిల్‌ఖాన్‌ ప్రకటించారు. ప్రధాన పార్టీలకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, బీజేపీ అభ్యర్థి గొమాసే శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ నామినేషన్లు నిబంధనల ప్రకారం సక్రమంగా ఉన్నందున ఆమోదించారు.

Updated Date - Apr 26 , 2024 | 11:50 PM