Share News

ఈవీఎం, వీవీప్యాట్‌ల పరిశీలన

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:31 AM

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో మొదటి రాండమైజేషన్‌లో భాగంగా సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు కేటాయించిన ఈవీఎంలు, వీవీప్యాట్‌ల తరలింపును శుక్రవారం కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి పరిశీలించారు.

ఈవీఎం, వీవీప్యాట్‌ల పరిశీలన
ఈవీఎంలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల రూరల్‌, ఏప్రిల్‌ 19: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో మొదటి రాండమైజేషన్‌లో భాగంగా సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు కేటాయించిన ఈవీఎంలు, వీవీప్యాట్‌ల తరలింపును శుక్రవారం కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి పరిశీలించారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని సర్ధాపూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గోదాముల్లో ఏర్పాటు చేసిన ఈవీఎంలు, వీవీప్యాట్‌లను రెండు నియోజకవర్గాలల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలకు తరలించే ప్రక్రియను వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో పర్యవేక్షించారు. సిరిసిల్ల నియోజకవర్గానికి కంట్రోల్‌ యూనిట్‌ 358, బ్యాలెట్‌ యూనిట్స్‌ 358, వీవీ ప్యాట్‌లు 401, వేములవాడ నియోజకవర్గానికి కంట్రోల్‌ యూనిట్స్‌ 325, బ్యాలెట్‌ యూనిట్స్‌ 325, వీవీ ప్యాట్‌లు 364 కేటాయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు పూజారి గౌతమి, ఖీమ్యానాయక్‌, ఆర్డీవోలు రమేష్‌, రాజేశ్వర్‌, కలెక్టరేట్‌ పర్యవేక్షకుడు శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:31 AM