Share News

బీజేపీని గద్దె దించడమే లక్ష్యం

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:46 PM

రానున్న పార్లమెంటు ఎ న్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నా మని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యు డు చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

బీజేపీని గద్దె దించడమే లక్ష్యం

పెద్దపల్లిటౌన్‌, ఏప్రిల్‌ 26: రానున్న పార్లమెంటు ఎ న్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నా మని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యు డు చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం నియంతత్వ పోకడలతో పదేళ్లు పరిపాలించి దేశాన్ని భ్రష్టు పట్టిం చిందని, కార్పొరేట్‌ సంస్థల చేతిలో మోదీ ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందని, రాజస్థాన్‌ ఎన్నికల సభలో మోదీ వాడిన భాషతో దేశం అల్లకల్లోలం అవుతుం దని, కాబట్టి రానున్న ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణ పాఠం ఓటు ద్వారా చెప్పి దేశాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సీపీఐ పక్షాన కాంగ్రెస్‌ పార్టీకి పూర్తిస్థాయి మద్దతిస్తున్నామన్నారు. అనంతరం శ్రీనివాస్‌ గొమాసే చేసిన ఆరోపణలపై చెన్నూరు శాస నసభ్యులు, మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ విలేకరుల ప్రశ్నలకు జవాబి చ్చారు. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు. కాక వెంకటస్వామి సంగరేణిని కాపా డంవల్ల ఎన్నో కుటుంబాలు సంతోషంగా గడుపుతున్నాయని వివ రించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు జైపూర్‌ పవర్‌ప్లాంట్‌, ఆర్‌ఎఫ్‌ సీఎల్‌ ఏర్పాటు కోసం కృషి చేయడం వల్లనే వేలాది మందికి ఉపా ధి కల్పించినట్లు తెలిపారు.పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల రైల్వే స్టేషన్లలో ఎన్నో ఎక్స్‌ప్రైస్‌ రైల్లు ఆగేందుకు కృషి చేశానన్నారు. నేను ఓడి పోయిన స్వచ్చంద సంస్థ ద్వారా 25 పాఠశాలలు నిర్మించానని, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో 2 వేల బోర్లు వేయించానని ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. శ్రీనివాస్‌ గోమాసే ఓడి న తరువాత ఇక్కడి ప్రజలకు కనీసం కనబడ్డాడా అని ప్రశ్నించారు. పదేళ్ళు మంత్రిగా ఉన్న కొపుల ఈశ్వర్‌ పెద్దపల్లిలో ఎప్పుడైన పర్య టించిన దాఖలాలు లేవన్నారు. పరిశ్రమలు స్థాపించేందకు కావాల్సి న వనరులు మార్కెటింగ్‌ లేకపోవడం వల్లనే నెలకొల్పలేదన్నారు. స్థానికుడు కాదని గగ్గోలు పెడుతున్నారు. రామగుండంలో ఒక ఇళ్ళు, మంచిర్యాలలో ఒక ఇళ్ళు ఉందని అవసరమైతే పెద్దపల్లిలో ఇళ్ళు కొంటానని సవాల్‌ విసిరారు. అనంతరం విలేకరుల అడిగిన ప్రశ్నలను జీర్ణించుకోలేని వివేక్‌ అనుచరులు ఒక ప్రధాన ప్రతిక ప్రతినిధిపై దురుసుగా ప్రవర్తిస్తూ కాకా కుటుంబం గురించి నీకు ఏం తెలుసని వివేక్‌ను ప్రశిస్తున్నావని బెదిరించగా పక్కనే ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఆ కార్యకర్తను వారించి పక్కకు పంపించారు. ఎమ్మెల్యే విజయ రమణా రావు కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు దళితుల అన్ని విధాలా న్యాయం చేసిందన్నారు. రాహూల్‌ ప్రధాని అయితే ఎస్సీ వర్గీకరణ బిల్లుపై నిర్ణయం దీనిపై ప్రెస్‌ మీట్‌కు హాజరై జర్న లిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ళ కేసీఆర్‌ పాలనలో ఏ ఒక్క దళితున్ని మంత్రిని చేయలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో స్పీకర్‌, డిప్యూ సీఎంమ్‌, హెల్త్‌ మినిస్టర్లను చేసిన ఘనత మాకే దక్కింద న్నారు. ఇక్కడి మాజి ఎమ్మెల్యే ఏనాడు రైతులను పట్టించు కున్న పాపాన పోలేదన్నారు. తాము అధికారంలోకి రాగానే ఒక్క గింజ కటింగ్‌ లేకుండా, వెంటనే ట్రక్‌ షీట్లు అందిస్తున్నామన్నారు. బీఆర్‌ ఎస్‌కు రైతులు, ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదన్నారు. ఈ సమావేవంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్‌, కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, మర్రి వెంకటస్వామి, కల్వల శ్రీని వాస్‌, కడార్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:46 PM