Share News

సురవరం దార్శనికుడు

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:28 PM

సురవరం ప్రతాపరెడ్డి గొప్ప దార్శనికుడని పీయూ వీసీ ప్రొఫెసర్‌ ఎల్‌బీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ అన్నారు. శుక్రవారం పీయూ లైబ్రరీ ఆడిటోరియంలో తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య సభ నిర్వహించారు.

సురవరం దార్శనికుడు

పీయూ వీసీ ప్రొఫెసర్‌ ఎల్‌బీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌

పాలమూరు యూనివర్సిటీ, ఏప్రిల్‌ 26: సురవరం ప్రతాపరెడ్డి గొప్ప దార్శనికుడని పీయూ వీసీ ప్రొఫెసర్‌ ఎల్‌బీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ అన్నారు. శుక్రవారం పీయూ లైబ్రరీ ఆడిటోరియంలో తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య సభ నిర్వహించారు. లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ ముఖ్య అతిథిగా హారై ప్రసంగించారు. తెలుగు బాషాబివృద్ధికి సురవరం ప్రతాపరెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. నిజాం ప్రభుత్వాన్ని ఎదురించి, వాస్తవ పరిస్థిలను, తెలంగాణ సాహిత్యాన్ని ప్రజలకు తెలియజేశారని చెప్పారు. పత్రికా రచయితగా, హైందవ ధర్మ సంధానకర్తగా, గ్రంధాలయాల నిర్మాణంలో ప్రముఖపాత్ర పోషించారన్నారు. 1926లో గోల్కొండ పత్రికను స్థాపించి, తెలంగాణలోని సాహిత్యాన్ని తెలియజేశారని చెప్పారు. అంతకు ముందు లోక కవి అందెశ్రీ మాట్లాడుతూ సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణలో కవులకు గుర్తింపు తెచ్చారన్నారు. జోగిపేటలో తొలి మహాసభను నిర్వహించడం ద్వారా ఎన్నో ఉద్యమాలకు నాంది పలికారన్నారు. తెలంగాణలో కవులు లేరని కించపరిచినప్పుడు ఉన్నారని ప్రపంచానికి తెలియజేశారని చెప్పారు. సురవరం స్ఫూర్తితోనే తాను నిప్పులవాగు రచించానన్నారు. ప్రొఫెసర్‌ కాశీం మాట్లాడుతూ సురవరం భూస్వామ్య వ్యవస్థను బద్దలుకొట్టి, తెలుగు బాషాభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. తెలంగాణలో ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పొశారన్నారు. ఆంధ్ర జన సంఘ సభ ద్వారా సంఘ సంస్కర్త అని నిరూపించుకున్నారని చెప్పారు. విశ్రాంత ప్రొఫెసర్‌ అండమ్మ మాట్లాడుతూ నిజాం కాలంలో సురవరం రచించిన మొగులాయిల కథలు ఎంతో ప్రసిద్ధి చెందాయన్నారు. స్ర్తీల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారని తెలిపారు. ఆ రోజుల్లో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న సురవరం ప్రతాప రెడ్డి కుమారుడు డాక్టర్‌ సురవరం కృష్ణవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ తండ్రి చేసిన సేవలను దగ్గరి నుంచి చూసిన అనుభవాలను పంచుకున్నారు. సురవరం ప్రతా్‌పరెడ్డి మనువడు సురవరం అనీల్‌ కుమార్‌రెడ్డి తాత సమాజిక కోణాన్ని వివరించారు. కార్యక్రమంలో ఆచార్య మనస చెన్నప్ప, ఆచార్య గోనా నామక్‌, ఇన్‌చార్జి రిజిస్ర్టార్‌ డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చంద్రకిరణ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.కృష్ణయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:28 PM