Share News

సీఎంఆర్‌ ఇవ్వని రైస్‌మిల్లులపై కేసు నమోదు

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:19 AM

కస్టం మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) ఇవ్వకుండా, ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లు యజమానులపై కేసు నమోదైంది.

సీఎంఆర్‌ ఇవ్వని రైస్‌మిల్లులపై కేసు నమోదు

తిరుమలగిరి, ఏప్రిల్‌ 19: కస్టం మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) ఇవ్వకుండా, ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లు యజమానులపై కేసు నమోదైంది. స్థానిక సంతోష్‌ రైస్‌ఇండసీ్ట్రస్‌ యజమాని ఇమ్మడి సోమనర్సయ్య, అంజయ్య, సోమయ్యలపై సివిల్‌ సప్లయ్‌ అధికారుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 16వ తేదీన అదనపు కలెక్టర్‌, ఆర్డీవో, సివిల్‌సప్లయ్‌ అధికారులు సంతోష్‌ రైస్‌ ఇండసీ్ట్ర్‌సలో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్‌ ఇవ్వని మిల్లులపై దాడులు నిర్వహించి వివరాలు సేకరించారు. సంతోష్‌ రైస్‌మిల్‌ నుంచి రూ.91.31 కోట్లకు సంబంధించిన 41,365 మెట్రిక్‌టన్నుల ధాన్యం పెండింగ్‌లో ఉన్నట్లు తేల్చారు. ఈఘటనపై జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి మోహనబాబు ఫిర్యాదు మేరకు మిల్లు యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.

నాగారం: సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని ఈటూరు పరిధిలోని ప్రగతినగర్‌లో ఉన్న రఘురాం రైస్‌ ఇండసీ్ట్రస్‌ యాజమానలైన ఇమ్మడి సోమనర్సయ్య, ఇమ్మడి అంజయ్య, ఇమ్మడి సోమయ్యలపై సివిల్‌ సప్లయ్‌ డీఎం రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పీ వెంకట్‌రెడ్డి తెలిపారు. రైస్‌మిల్లుకు 2022-23 యాసంగి సీజన, 2023-24 వానాకాలం సీజనలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 3,5001 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లుకు సరఫరా చేశారు. వాటి విలువ రూ.7.71 కోట్లుగా సివిల్‌ సప్లయ్‌ అధికారులు తేల్చారు. ఆ ధాన్యానికి సంబంధించి సీఎంఆర్‌ ఇవ్వకపోవడంతో ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం మిల్లు యాజమాన్యంపై సివిల్‌ సప్లయ్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఆ మేరకు ఇమ్మడి సోమనర్సయ్య, ఇమ్మడి అంజయ్య, ఇమ్మడి సోమయ్యలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Apr 20 , 2024 | 12:19 AM