Share News

రుణాలివ్వడంలో జాప్యమేల?

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:55 PM

ప్రధానమంత్రి వీధివ్యాపారుల ఆత్మనిర్భర్‌ నిధి (పీఎం స్వనిధి) పథకం రుణాల మంజూరులో జాప్యం నెలకొం ది. మునిసిపాలిటీల్లో గుర్తించిన వీధి వ్యాపారులకు బ్యాంకులు దశలవారీ గా రుణాలను మంజూరు చేయాల్సి ఉంటుంది.

రుణాలివ్వడంలో జాప్యమేల?

క్రమేపీ తగ్గుతున్న పీఎం స్వనిధి రుణాలు

రుణాల మంజూరులో కొర్రీలు

జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో మూడో విడత 38శాతం మాత్రమే రుణాల మంజూరు

భువనగిరి టౌన్‌, ఏప్రిల్‌ 26: ప్రధానమంత్రి వీధివ్యాపారుల ఆత్మనిర్భర్‌ నిధి (పీఎం స్వనిధి) పథకం రుణాల మంజూరులో జాప్యం నెలకొం ది. మునిసిపాలిటీల్లో గుర్తించిన వీధి వ్యాపారులకు బ్యాంకులు దశలవారీ గా రుణాలను మంజూరు చేయాల్సి ఉంటుంది. షరతులు, వడ్డీ లేకుండానే బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. ఈమేరకు మొదటి, రెండు దఫాల రుణాల మంజూరు, రికవరీ పూర్తికాగా, మూడో దశ రుణాలను ఇవ్వాల్సి ఉంది. ఇంతవరకు సజావుగానే సాగినా, పలు కారణాలు చూపుతూ మూడో దఫా రుణాలను మంజూరు చేయడంలో బ్యాంకులు చేస్తున్న జాప్యంతో పీఎం స్వనిధి రుణాలపై ఆధారపడిన వీధి వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారు. పెట్టుబడి లేక వ్యాపార పురోగతి మందగించి సంబంధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ మేరకు మూడో దఫా రుణాలను జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో 1,113 మంది వీధి వ్యాపారులకు ఇవ్వా ల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 429 (38.54 శాతం) మందికే బ్యాంకు లు రుణాలు మంజూరు చేశాయి.

రూ.10వేల నుంచి రూ.50వేల వరకు..

మునిసిపాలిటీల్లో పలు పేద కుటుంబాలు పండ్లు, కూరగాయలు, పువ్వులు తదితర వీధి వ్యాపారాలతో జీవనం సాగిస్తున్నాయి. వ్యాపారాల నిర్వహణకు అనువైన సొంత భవనాలు లేకపోడం, అద్దె చెల్లించే ఆర్థిక స్థోమత లేకపోవడం, ఓస్థాయి వ్యాపారాలకు కూడా పెట్టుబడి లేకపోవడంతో వీధుల వెంటే రోజువారీగా చిరువ్యాపారా లు చేస్తూ ఆ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2019లో మానవాళికి ముప్పు గా మారిన కరోనా విజృంభన తో వీధి వ్యాపారులు అతలాకుతలమయ్యా రు. పూట గడవని దీనస్థితికి చేరారు. దీంతో చిరు వ్యాపారులను ఆదుకునే లక్ష్యంతో మునిసిపాలిటీలలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) గుర్తించిన వీధి వ్యాపారులకు 2019లో నిర్ధేశిత బ్యాంకులు రూ.10వేల చొప్పున రుణాలను అందించాయి.రుణాలను చెల్లించిన వారికి రెండో దఫా లో రూ.20వేలు రుణంగా బ్యాంకులు ఇచ్చాయి. ఈమేరకు ప్రస్తుతం మూ డో విడతగా రూ.50వేల చొప్పున రుణాలను మంజూరు చేయాల్సి ఉంది.

జిల్లాలో వీధి వ్యాపారులు ఇలా..

జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో మెప్మా గుర్తించిన 9,119 మంది వీధి వ్యాపారులున్నారు. వీరిలో మొదటి దఫాలో రూ.10వేల చొప్పున 7,066 మందికి మెదటి విడత రుణాలు అందాయి. రెండో విడతలో రూ.20వేల చొప్పున 3,686 మందికి రుణాలు అందాయి. మూడో విడతలో రూ.50వేల చొప్పున ఇప్పటివరకు కేవలం 429 మందికి మాత్రమే బ్యాంకులు పీఎం స్వనిధి రుణాలను మంజూరు చేశాయి. రుణ వా యిదాల చెల్లింపు ప్రాతిపదికన తదుపరి రుణాలను మంజూరు చేస్తున్నామని బ్యాంకర్లు పేర్కొంటున్నాయి. కానీ పలువురు వీధి వ్యాపారులు మా త్రం తాము పలు ఇబ్బందులతో సకాలంలో వాయిదాలు సక్రమంగా చెల్లించనప్పటికీ గడువులోపు రుణాలు చెల్లించినా, వాయిదాల చెల్లింపు రికార్డు సక్రమంగా లేదనే కారణాలతో తదుపరి రు ణాల మంజూరులో బ్యాంకర్లు కొర్రీలు పెడుతూ వేధిస్తున్నట్లు వీధి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారాలు సక్రమంగా నడవకపోవ డం, రుణ వాయిదాలు, చెల్లింపుపై అవగాహన లోపించడంతో సకాలంలో వాయిదాలను చెల్లించలేకపోయామని వీధి వ్యాపారులు అంటున్నారు. సక్రమంగా రుణ వాయిదాలను చెల్లించలేదనే కారణంతో విడతలవారీగా వీధి వ్యాపారులకు ఇస్తున్న స్వనిధి రుణాలను బ్యాంకులు తగ్గించ డం సరికాదని వీధి వ్యాపారులు పేర్కొంటున్నారు. అయితే భువనగిరిలోని జాతీయ బ్యాంక్‌లు మూడో విడత రుణాలను మంజూరు చేస్తున్నప్పటికీ ఓ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ మాత్రం ఇప్పటివరకు ఏ ఒక్కరికి మూడో విడ త రుణాలు ఇవ్వకపోవడం గమనార్హం. పైగా రుణాలకోసం వెళ్తున్నవారి పట్ల ఆబ్యాంక్‌ సిబ్బంది దురుసుగా మాట్లాడుతున్నారని వీధి వ్యాపారులు ఆరోపిస్తున్నారు.

సకాలంలోనే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి : రమేష్‌ బాబు, మెప్మా యాదాద్రి జిల్లా అధికారి.

జిల్లాలోని ఆరు పట్టణాల్లో వీధి వ్యాపారులకు బ్యాంకు లు సకాలంలోనే పీఎం స్వనిధి రుణాలను మంజూరు చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం అర్హులైన వీధి వ్యాపారులందరికీ మూడు దఫాలుగా రుణాలు మంజూరవుతున్నాయి. మూడో దఫా రుణాల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే నిబంధనల ప్రకారమే రుణాల మంజూరు ప్రక్రియ సాగుతున్నది. అర్హులందరికీ రుణాలు అందుతాయి. బకాయి పడిన వీధి వ్యాపారులందరూ వెంటనే పెండింగ్‌ రుణాలను చెల్లించి తదుపరి రుణాలను పొంది. వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలి.

మునిసిపాలిటీలవారీగా వ్యాపారుల రుణాలు ఇలా..

మొదటి విడత(రూ.10వేలు) రెండో విడత (రూ.20వేలు) మూడో విడత (రూ.50వేలు)

మునిసిపాలిటీ వీధి వ్యాపారులు లక్ష్యం మంజూరు లక్ష్యం మంజూరు లక్ష్యం మంజూరు

భువనగిరి 3426 2805 2575 (91.82 శాతం) 1784 1335 (74.85 శాతం) 165 129 (78.18 శాతం)

చౌటుప్పల్‌ 1721 1622 1337 (82.44 శాతం) 753 693 (92.01 శాతం) 240 72 (30 శాతం)

యాదగిరిగుట్ట 1123 912 733 (80.37 శాతం) 514 269 (52.36 శాతం) 144 41 (35.96 శాతం)

ఆలేరు 1039 847 895 (105.66శాతం) 592 572 (96.59శాతం) 140 65 (46.43శాతం)

భూదాన్‌పోచంపల్లి 936 812 855 (105.30 శాతం) 584 425 (72.80శాతం) 293 58 (19.80శాతం)

మోత్కూరు 874 715 671 (93.85 శాతం) 441 392 (88.89 శాతం) 161 64 (39.75 శాతం)

మొత్తం 9119 7712 7066 (91.62 శాతం) 4668 3686 (78.97 శాతం) 1113 429 (38.54 శాతం)

Updated Date - Apr 26 , 2024 | 11:55 PM