Share News

ఇక ప్రచారణమే!

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:52 PM

మైకుల మోతలు.. కార్యకర్తల నినాదాలు.. నాయకుల ప్రసంగాలతో జిల్లా హోరెత్తుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున, వారి అగ్రనేతలు, ద్వితీయ శ్రేణి నేతలు సుడిగాలి పర్యటనలు చేశారు.

ఇక ప్రచారణమే!

తేలిన అభ్యర్థులతో క్షేత్రస్థాయి ప్రచారానికి సన్నాహాలు

మూడు ప్రధాన పార్టీల భిన్న ప్రచార వ్యూహాలు

స్టార్‌ క్యాంపెయినర్ల ప్రచారానికి సన్నాహాలు

మేనిఫెస్టోలతోపాటు, స్థానిక అంశాలపై ఫోకస్‌

రాజకీయ సమీకరణాలపైనే ప్రత్యేక కసరత్తు

(ఆంధ్రజ్యోతిప్రతినిఽఽధి-నల్లగొండ): మైకుల మోతలు.. కార్యకర్తల నినాదాలు.. నాయకుల ప్రసంగాలతో జిల్లా హోరెత్తుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున, వారి అగ్రనేతలు, ద్వితీయ శ్రేణి నేతలు సుడిగాలి పర్యటనలు చేశారు. విడుతల వారీగా అభ్యర్థుల గెలుపుకోసం పర్యటనలు చేస్తూ కార్యకర్తల్లో ఉత్తేజం, ప్రజల నుంచి ఓట్లు రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. అయితే పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారాస్ర్తాన్ని ఓటరుకు చేరే వేసే పనిలో నేతలు తలమునకలయ్యారు.

లోక్‌సభ ఎన్నికల సమరంలో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రధాన పార్టీలు, అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రచారం హోరెత్తించాలని నిర్ణయించాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ తరఫున మాజీ సీఎం కేసీఆర్‌, బీజేపీ నుంచి కేంద్రమంత్రులు జైశంకర్‌, కిరణ్‌రిజిజు , సీపీఎం అభ్యర్థి తరఫున ఆపార్టీ అగ్రనేత బీవీరాఘవులు జిల్లాలో పర్యటించారు. ఇక కీలక ప్రచారఘట్టంలో కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకగాంఽధీచే రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో రెండు బహిరంగసభలు నిర్వహించాలని కాంగ్రెస్‌ భావిస్తుంటే, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీమంత్రి హరీ్‌షరావు రోడ్‌షోలకు బీఆర్‌ఎస్‌ కసరత్తు చేస్తోంది. బీజేపీ తరఫున కేంద్రహోంశాఖమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాలతో సభలు నిర్వహించేందుకు బీజేపీ ప్రణాళిక రచిస్తోంది.

మేనిఫెస్టోలతోపాటు, స్థానిక సమస్యలపై అభ్యర్థుల ఫోకస్‌..

లోక్‌సభ ఎన్నికల్లో ద్విముఖ ప్రచారవ్యూహాన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు అనుసరిస్తున్నారు. పాంచ్‌ న్యాయ్‌.. పచ్చీస్‌ గ్యారంటీస్‌ నినాదంతోపాటు ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం, బ్రాహ్మణవెల్లంల, ఎత్తిపోతల పథకాలు, డిండి ఎత్తిపోతల పథకం అమలుతో పాటు జాతీయ రహదారుల నిర్మాణా లు, మునిసిపాలిటీలకు కేంద్ర నిధులతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలు, మౌ లిక వసతుల కల్పనతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆరు గ్యారంటీల ను అమలు చేయడమే ప్రధాన ప్రచారాస్త్రాలుగా కాంగ్రెస్‌ ముందుకెళుతోంది. ఓ వైపు ప్రచారాంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలపైనా ఆపార్టీ దృష్టిసారించింది. గతంలో పార్టీని వీడినవారిని, జనబలం కలిగిన నాయకులు, వారి వర్గాలను పార్టీలో చేర్చుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్‌ సైతం కాంగ్రె్‌సకు ధీటుగా ప్రచారవ్యూహం రచించింది. కేంద్రంతో తెలంగాణ హక్కులకోసం కొట్లాడాలం టే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే ఎంపీలుగా గెలిపించాలనే ప్రధాన నినాదంతోపాటు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరువుకు, పంటలు నష్టపోవడానికి కాంగ్రెస్‌ అసమర్థతే కారణమే వాదనను ఆపార్టీ తెరమీదకు తెచ్చింది. కృష్ణాజలాల హక్కుల సాధనలో, రైతాంగ సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ విఫలమైందనే విమర్శనే ప్రఽధానంగా బీఆర్‌ఎస్‌ ప్రజల్లోకి తీసుకెళుతోంది. మరోవైపు కేడర్‌ చేజారకుండా నాయకులను సమన్వయం చేసుకుంటూ భవిష్యత్‌ తమదేననే సంకేతాలతో ప్రచారం కొనసాగిస్తోం ది. మరో ప్రధాన పోటీదారు బీజేపీసైతం ఈసారి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రత్యేక వ్యూహాన్నే అమలు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికలోనే భిన్నత్వాన్ని ప్రదర్శించి పూర్వపు బీఆర్‌ఎస్‌ ఎంపీ బూరనర్సయ్యగౌడ్‌, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని ఎంపీ అభ్యర్థులుగా బరిలో దింపింది. మూడోసారి కేంద్రంలో మోదీ సర్కార్‌ నినాదంతోపాటు, బీసీ వర్గాల అండ పొందేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలు రెండూ అవినీతి, కుటుంబ పార్టీలని విమర్శిస్తూ, నల్లగొండ ఉమ్మడి జిల్లాలో నూ మూడు కుటుంబాల పాలన సాగిస్తోందని విమర్శిస్తోంది. బీజేపీకి అవకాశమిస్తేనే వ్యవసాయాధారిత జిల్లాలో ఫుడ్‌ ప్రా సెసింగ్‌ పరిశ్రమలు ఏర్పాటు చేసి రైతులకు ఉపయుక్తకరమై న పనులు చేపడతామనే ప్రచారాన్ని ఆ పార్టీ కొనసాగిస్తోంది. మొత్తంగా మూడు ప్రధాన పార్టీలు ఉమ్మడి జిల్లాలో భిన్నమైన ప్రచార వ్యూహంతో ముందుకెళుతుండడంతో ప్రజలు ఎవరిని ఏ స్థాయిలో ఆదరిస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Updated Date - Apr 26 , 2024 | 11:52 PM