Share News

సేంద్రియ వ్యవసాయంతోనే సంపూర్ణ ఆరోగ్యం

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:58 PM

సేంద్రియ వ్యవసాయంతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని నా బార్డు డీడీ ఎం వినయ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని పాలడు గు గ్రామంలో మదర్‌ థెరిస్సా గ్రామీ ణ అభివృద్ధి సంస్థ విరాళంగా ఇచ్చిన రూ.24లక్షల తో నిర్మించిన శ్రీమత్స్యగి రి రైతు ఉత్పత్తిదారుల సంఘం నూతన భవనాన్ని ప్రా రంభించి మాట్లాడారు.

సేంద్రియ వ్యవసాయంతోనే సంపూర్ణ ఆరోగ్యం

సేంద్రియ వ్యవసాయంతోనే సంపూర్ణ ఆరోగ్యం

నాబార్డు డీడీఎం వినయ్‌కుమార్‌

మోత్కూరు, ఏప్రిల్‌ 26: సేంద్రియ వ్యవసాయంతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని నా బార్డు డీడీ ఎం వినయ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని పాలడు గు గ్రామంలో మదర్‌ థెరిస్సా గ్రామీ ణ అభివృద్ధి సంస్థ విరాళంగా ఇచ్చిన రూ.24లక్షల తో నిర్మించిన శ్రీమత్స్యగి రి రైతు ఉత్పత్తిదారుల సంఘం నూతన భవనాన్ని ప్రా రంభించి మాట్లాడారు. స్వచ్ఛంద సంస్థ, నాబార్డు అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని రైతుసంఘం సభ్యులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. కేవలం వరి, పత్తి పం టలకే ప్రాధాన్యత ఇవ్వకుండా మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలు సాగుచేసి లాభాలు అర్జించాలన్నారు. కార్యక్రమంలో మదర్‌థెరిస్సా గ్రామీణ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపకుడు ఫాదర్‌ జూలియన్‌ పొలిసెట్టి, సిరి ఆర్గనైజేషన్‌ ప్రతినిధి శ్రీనివాస్‌, ఏవో కె.స్వప్న, ఏఈవోలు టి.గోపీనాథ్‌, జె.సైదులు, ఎం.అశోక్‌, ఎఫ్‌పీవో నర్సింహాచారి, రైతు సంఘం అధ్యక్షుడు వల్లపు సైదులు, రాజు, మాజీ ఎంపీటీసీ అంతటి నర్సయ్య, మాజీ ఉపసర్పంచ్‌ ఎడ్ల భగవంతు, సంఘం డైరెక్టర్లు మాధవి, వెంకట య్య, యాదయ్య, మచ్చగిరి, బూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:58 PM