Share News

రెండో ర్యాండమైజేషన్‌ పూర్తి

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:00 AM

పీవో, ఏపీవో, ఓపీవోల రెండో ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తయినట్లు సాధారణ ఎన్నికల పరిశీలకుడు రాబర్ట్‌సింగ్‌ క్షేత్రిమాయమ్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన ర్యాండమైజేషన్‌ ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు.

రెండో ర్యాండమైజేషన్‌ పూర్తి

సాధారణ ఎన్నికల పరిశీలకుడు రాబర్ట్‌సింగ్‌ క్షేత్రిమాయమ్‌

భువ నగిరి అర్బన్‌, ఏప్రిల్‌ 26: పీవో, ఏపీవో, ఓపీవోల రెండో ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తయినట్లు సాధారణ ఎన్నికల పరిశీలకుడు రాబర్ట్‌సింగ్‌ క్షేత్రిమాయమ్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన ర్యాండమైజేషన్‌ ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో 17 మండలాలకు సంబంధించి భువనగిరి, ఆలేరు పూర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు, తుంగతుర్తి, నకిరేకల్‌, మునుగోడు, పాక్షిక అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 16 పోలింగ్‌ కేంద్రాలకు విధుల నిర్వహణకు 3,856మంది సిబ్బందిని కేటాయించామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే, అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలోమ్‌, జిల్లా విద్యాశాఖ అధికారి కే.నారాయణరెడ్డి, కలెక్టరేట్‌ ఏఈవో సి.జగన్మోహన్‌ ప్రసాద్‌, ఈడీఎం సాయికుమర్‌, ఏ.ఎ్‌సవో నరహరి తదితరులు పాల్గొన్నారు.

సాధారణ పరిశీలకుడి సూచనలు పాటించాలి

ఎన్నికలకు సంబంధించి సాధారణ పరిశీలకుడి సూచనలు పాటించాలని జిల్లా రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే అన్నారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి మణిపూర్‌ 2010 ఐఏఎస్‌ కేడర్‌ రాబర్ట్‌సింగ్‌ క్షేత్రిమాయిమ్‌ నియమితులయ్యారన్నారు. భువనగిరి లోక్‌సభ పరిధి లో భువనగిరి, ఆలేరు, మునుగోడు, నకిరేకల్‌, తుంగతుర్తి, జనగాం, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్లు, ఆయా పార్టీలు, అభ్యర్థులు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై సూచనలు, ఫిర్యాదులు చేసే వారు సెల్‌:996346221కు సా యంత్రం 4గంటల నుంచి 6గంటల వరకు సూచనలు, ఫిర్యాదులు అందజేయాలన్నారు. అదేవిధంగా జనరల్‌ పరిశీలన లైజనింగ్‌ అధికారి, జిల్లా మత్స్యశాఖఅధికారి పి.రాజారాంను సెల్‌:9000368915నుద్వారా సంప్రదించాలన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:00 AM