Share News

మానసిక ప్రశాంతతను మించినది మరొకటిలేదు

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:59 PM

ప్ర పంచంలో మానసి క ప్రశాంతతను మించినది మరొకటి లేదని పుష్పగిరి పీఠాధిపతి జగద్గురు విద్యాశంకరభారతి మహాస్వా మి అన్నారు. శుక్రవా రం జిల్లా కేంద్రంలోని సంతోషిమాతా దేవాలయంలో శ్రీమానసదేవి విగ్రహ ప్రతిష్ఠాపనలో ఆయన పాల్గొన్నారు.

మానసిక ప్రశాంతతను మించినది మరొకటిలేదు
విగ్రహ ప్రతిష్ఠాపనలో పుష్పగిరి పీఠాధిపతి

సూర్యాపేటటౌన, ఏప్రిల్‌ 26 : ప్ర పంచంలో మానసి క ప్రశాంతతను మించినది మరొకటి లేదని పుష్పగిరి పీఠాధిపతి జగద్గురు విద్యాశంకరభారతి మహాస్వా మి అన్నారు. శుక్రవా రం జిల్లా కేంద్రంలోని సంతోషిమాతా దేవాలయంలో శ్రీమానసదేవి విగ్రహ ప్రతిష్ఠాపనలో ఆయన పాల్గొన్నారు. పరమశివుడు వైరాగ్యంతో ఉంటూ ఒకేసారి అమితానందాన్ని పొందడంతో మానసదేవి ఉద్భవించిందన్నారు. మనిషికి ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగం వంటి రంగాల్లో తృప్తిగా ఉన్నా మానసిక ప్రశాంతత లేకపోతే జీవితానికి మనుగడ ఉండదన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలన్నారు. దేవాలయాలు అభివృద్ధి చెందాలంటే భజన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం శుక్రవారం పురస్కరించుకొని సంతోషిమాతకు నూతన పట్టువసా్త్రలంకరణ, ఉద్యాపన వ్రతం, మహిళలతో ఒడిబియ్యం నిర్వహించారు. భక్తులకు అన్నదానం జరిగింది. అంతకుముందు విద్యాశంకర భారతిమహాస్వామికి దేవాలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంఎల్‌ఆర్‌గుప్తా, నూక వెంకటేశంగుప్తా, బ్రహ్మండ్లపల్లి మురళీధర్‌, పాలవరపు రాంమూర్తి, విద్యాసాగర్‌రావు, అశోక్‌, ప్రకా్‌షరావు, మల్లికార్జున, రామయ్య, పాపిరెడ్డి, సోమయ్య, లింగారెడ్డి, రాజు, దేవిదత్తు, విజయకుమార్‌, రవిశంకర్‌, శివప్రసాద్‌, అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ, వంశీకృష్ణశర్మ, కృష్ణమాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:59 PM