Share News

అకాల వర్షం.. పంటలకు నష్టం

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:22 AM

రాజాపేట మండలంలోని సింగారం, జాల, కొత్తజాల, పాముకుంట, కుర్రారం, గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది.

అకాల వర్షం.. పంటలకు నష్టం
రాజాపేట మండలం సింగారంలో నేలరాలిన మామిడి కాయలు

రాజాపేట, ఏప్రిల్‌ 19: రాజాపేట మండలంలోని సింగారం, జాల, కొత్తజాల, పాముకుంట, కుర్రారం, గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. సింగారంలో పది నిమిషాల పాటు వడగండ్లు కురిశాయి. ఈదురు గాలులతో ఆయా గ్రామాల్లో మామిడి తోటలు నష్టం వాటిల్లింది. మామిడి కాయలు రాలి పోయాయి. అదే విధంగా విద్యుత్‌ స్తంభాలు, చెట్లు విరిగి విద్యుత్‌ తీగలపై పండడంతో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. ధాన్యపు కొను గోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం తడిసిపోయింది. వడగండ్లు కురిసిన ప్రాం తాన్ని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి సందర్శించి రైతులను పరామర్శించారు. ప్రభుత్వం ఆధుకోవాలని డిమాండ్‌ చేశారు.

చౌటుప్పల్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో...

చౌటుప్పల్‌ టౌన్‌: చౌటుప్పల్‌ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రాశుల కిందకు వర్షపు నీరు చేరడంతో పాక్షికంగా ధాన్యం తడిసింది. 181మంది రైతులు యార్డులో ధాన్యం రాశులు పోశారు. యార్డులోని రేకుల షెడ్లు, మడిగెల సముదాయం పై నుంచి జారీ పడిన వర్షపు నీరు రాశుల కిందకు చేరడంతో కొంత మేరకు ధాన్యం తడిసింది. తూకాలు వేసిన ధాన్యం బస్తాల కిందికి సైతం వర్షపు నీరు చేరడంతో తడిసిపోయాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో ధాన్యం రాశులకు టార్పాలిన్‌ కవర్‌ లను కప్పి గాలికి లేచి పోకుండా బండరాళ్లు ఉంచారు. ధాన్యం రాశుల కిందకు వర్షపు నీరు చేరకుండా వరి పంట తాలును చుట్టూ కట్టగా వేశారు. ఆకాశంలో కమ్ముకున్న మబ్బులను చూసి రైతు లు ఆందోళనగా యార్డులో తిరగడం కనిపించింది. చౌటుప్పల్‌ మం డలంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తూకాలను వేగవంతం చేయాలని బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కంది లక్ష్మారెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ప్రజలు ఊరట చెందగా, రైతులలో ఆందోళన అలముకుంది. కొద్ది రోజులుగా భగభగ మండే ఎండలతో తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రజలకు అకాల వర్షంతో కొంత ఉపశమనం లభించింది. సుమారు 20నిమిషాల పాటు కురిసిన వర్షానికి రోడ్ల పై నీరు నిలిచింది. ఇళ్లపై నుంచి జారి పడే వర్షపు నీటిని పట్టుకునేందుకు బకెట్లను పెట్టుకున్నారు. 20నిమిషాల పాటు కురిసిన వర్షానికి వాతావ రణం ఒక్కసారిగా చల్లబడింది. ఇళ్ల లోని పండ్ల చెట్లు, పూల మొక్కలకు కొంత తేమ లభించింది.

Updated Date - Apr 20 , 2024 | 12:22 AM