ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిర్‌క్రాఫ్ట్ నియమాల్లో మార్పుల... draft notification జారీ

ABN, First Publish Date - 2022-07-08T01:58:53+05:30

విమానాల నిబంధనల్లో మార్పులకు సంబంధించి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : విమానాల నిబంధనల్లో మార్పులకు సంబంధించి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. నిబంధనలకు సంబంధించిన సూచనలు, అభ్యంతరాలను 30 రోజుల్లోగా అందించాలంటూ  మంత్రిత్వ శాఖ కోరింది. మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన సవరణల ప్రకారం... లైసెన్సింగ్ అథారిటీ మాత్రమే లైట్ స్పోర్ట్ షిప్‌లు, గైరోప్లేన్‌ల లైసెన్స్‌ను జారీ చేస్తుంది. సూచనలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, Opp. సఫ్దర్‌జంగ్ హైవే, న్యూఢిల్లీ - 110003 కు పంపవచ్చు.


లేదా...  dgoffice.dgca@nic.inకు ఈ-మెయిల్ చేయాలని నోటిఫికేషన్ పేర్కొంది. మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన సవరణల ప్రకారం... లైసెన్సింగ్ అథారిటీ మాత్రమే లైట్ స్పోర్ట్‌షిప్‌లు, గైరోప్లేన్‌ల లైసెన్స్‌ను జారీ చేస్తుంది. అంతేకాకుండా... మెడికల్ ఫిట్‌నెస్, చెల్లుబాటు మరియు లైసెన్స్ వ్యవధిని కూడా నిర్ణయిస్తుంది. కమర్షియల్ పైలట్ లైసెన్స్ చెల్లుబాటును పొడిగించే ప్రతిపాదనను కూడా సవరణల్లో చేర్చారు. ఇది ప్రస్తుత 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల పొడిగింపునుకు చెల్లుబాటవుతుంది. ఇక... ఫ్లైట్ నావిగేటర్, రేడియో టెలిఫోన్ ఆపరేటర్ లైసెన్స్ కూడా 10 సంవత్సరాల వరకు చెల్లుబాటులో ఉంటుందని ముసాయిదా పేర్కొంది. ఎయిర్‌లైన్స్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ లైసెన్స్ చెల్లుబాటు కూడా 10 సంవత్సరాలకు ప్రతిపాదించారు. ఇక... విమానాశ్రయం పరిసరాల్లో ఏరోడ్రోమ్/లైట్ షో కోసం దూరాన్ని 5 నాటికల్ మైళ్లకు పెంచే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ప్రస్తుతం, ఈ దూరం 5 కిలోమీటర్లు. కాగా... ఈ అంశానికి సంబంధించి మంత్రిత్వశాఖ తర్జనభర్జనలు పడుతున్నట్లు వినవస్తోంది. 

Updated Date - 2022-07-08T01:58:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising