ANDHRAJYOTHY
చిత్రజ్యోతి
40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్ నెం: 9390 999 999,    7674 86 8080

MatruDevoBhava: మాతృదేవోభవ విడుదలకు సిద్ధం

Published: Tue, 14 Jun 2022 18:58:11 IST

గతంలో మాతృదేవోభవ (MatruDevoBhava) పేరుతో వచ్చిన చిత్రం ఏ స్థాయిలో విజయవంతమైందో అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ ఆ సినిమాకి నీరాజనాలు పలికారు. ముఖ్యంగా ఆ చిత్రంలోని ఎమోషనల్ సీన్స్.. థియేటర్స్‌లో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించాయి. సంవత్సరాల తరబడి ఈ సినిమా థియేటర్స్‌లో ఆడటమే కాకుండా.. ప్రతి ఒక్క ఫ్యామిలీని సినిమా హాలుకు తీసుకొచ్చింది. అయితే ఇప్పుడదే పేరుతో.. అదే రకమైన సెంటిమెంట్ కలిగిన కంటెంట్‌తో.. మరొక చిత్రం విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..


శ్రీ వాసవి మూవీస్ బ్యానర్‌పై..  సీనియర్ నటి సుధ (Sudha) టైటిల్ పాత్రలో నటించిన చిత్రం మాతృదేవోభవ. MS రెడ్డి సమర్పణలో.. కె . హరనాథ్ రెడ్డి (K Haranath Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఓ అమ్మ కథ (O Amma Katha) అనేది ట్యాగ్ లైన్. సుధ భర్తగా సీనియర్ నటుడు సుమన్ (Suman) నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూలై 1న ఘనంగా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. KJS రామారెడ్డి కథ అందించిన ఈ చిత్రంతో పతాంజలి శ్రీను, అమృత చౌదరి హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. భర్త ప్రమాదంలో చనిపోవడంతో.. తన పిల్లలను ఓ తల్లి ఏ విధంగా పెంచిందనే కంటెంట్ తీసుకొని.. ఎమోషనల్‌ ఎలిమెంట్స్ జొప్పిస్తూ ఈ సినిమాని రూపొందించినట్లుగా నిర్మాత చోడవరపు వెంకటేశ్వరరావు తెలిపారు.

Show comments