ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2026 మార్చి వరకు వడ్డింపు

ABN, First Publish Date - 2022-06-26T08:15:21+05:30

జీఎ్‌సటీ పరిహార సుంకాన్ని మరో నాలుగేళ్లపాటు కొనసాగించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీఎస్‌టీ పరిహార సుంకం.. 

కార్లు, లగ్జరీ బైకులు, సిగరెట్‌, పాన్‌మసాలా వంటి 

ఉత్పత్తులపై కొనసాగనున్న అధిక పన్ను భారం 


న్యూఢిల్లీ: జీఎ్‌సటీ పరిహార సుంకాన్ని మరో నాలుగేళ్లపాటు కొనసాగించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022 జూన్‌ 30తో ముగియనున్న ఈ పరిహార సుంకం విధింపు గడువును 2026 మార్చి 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ శనివారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కరోనా సంక్షోభ ప్రభావంతో గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఏర్పడిన జీఎ్‌సటీ ఆదాయ లోటును భర్తీ చేసుకునేందుకు పరిహార సుంకాన్ని కొనసాగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్న జీఎ్‌సటీ మండలి నిర్ణయించింది. జీఎ్‌సటీ అమలు కారణంగా ప్రతినెలా ఏర్పడే పన్ను ఆదాయ లోటును భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పరిహారం చెల్లించే పద్ధతి 2022 జూన్‌తో ముగుస్తుందని గత ఏడాది సెప్టెంబరులో లఖ్‌నవూలో జరిగిన 45వ జీఎ్‌సటీ మండలి సమావేశం అనంతరం సీతారామన్‌ తెలిపారు. అయితే, రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో చేసిన అప్పులను తిరిగి చెల్లించేందుకు కార్ల వంటి విలాస వస్తువులతో పాటు సిగరెట్‌, పాన్‌ మసాలా వంటి అనారోగ్యకారక ఉత్పత్తులపైన మాత్రం ఈ సుంకాన్ని 2026 మార్చి వరకు కొనసాగిస్తామని మంత్రి వెల్లడించారు.


రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020-21లో రూ.1.1 లక్షల కోట్లు, 2021-22లో రూ.1.59 లక్షల కోట్ల రుణాలు తీసుకుంది. ఈ రుణాలపై 2021-22లో రూ.7,500 కోట్ల వడ్డీ చెల్లించిన కేంద్ర సర్కారు.. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో రూ.14,000 కోట్లు కట్టనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) నుంచి ప్రారంభం కానున్న ‘అసలు’ బాకీ చెల్లింపులు 2026 మార్చి వరకు కొనసాగనున్నాయి. దేశంలో ఏకరీతి పరోక్ష పన్ను విధానాన్ని ప్రవేశపెట్టేందు మోదీ ప్రభుత్వం 2017 జూలై 1 నుంచి జీఎ స్‌టీ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ చట్టం అమలు కారణంగా ప్రతినెలా ఏర్పడే పన్ను ఆదాయ లోటును భర్తీ చేసేందుకు ఐదేళ్ల వరకు పరిహారం చెల్లిస్తామని కేంద్రం రాష్ట్రాలకు హామీ ఇచ్చింది. ఈ నెలతో పరిహారం చెల్లింపు హామీ గడువు ముగియనుంది. అయితే, పరిహారం చెల్లింపుల విధానాన్ని మరికొన్నేళ్లు కొనసాగించాలని పలు రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ, కేంద్రం మాత్రం ఇందుకు సుముఖంగా లేదు. వచ్చే వారం (ఈనెల 28-29)లో జీఎ్‌సటీ మండలి శ్రీనగర్‌లో సమావేశం కానుంది. ఈ భేటీలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు తమకు పరిహారం చెల్లింపులను కొనసాగించాలని పట్టుబట్టే అవకాశం ఉంది.

Updated Date - 2022-06-26T08:15:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising