ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెబల్స్ భార్యలకు నచ్చజెప్పేందుకు రంగంలోకి ఉద్ధవ్ సతీమణి

ABN, First Publish Date - 2022-06-26T20:39:59+05:30

మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం మలుపులు తిరుగుతోంది. రెబల్ ఎమ్మెల్యేలను వారి భార్యలతోనే నచ్చచెప్పించే ప్రయత్నాలను ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం (Political Crisis) మలుపులు తిరుగుతోంది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలను వారి భార్యలతోనే నచ్చచెప్పించే ప్రయత్నాలను ఉద్ధవ్ థాకరే సతీమణి రష్మి థాకరే (Rashmi Thackeray) చేపట్టారు. రెబల్ ఎమ్మెల్యేల భార్యలతో రష్మి సంప్రదింపులు సాగిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు ఉద్ధవ్ థాకరే సైతం గౌహతిలోని హోటల్‌లో బస చేసిన పలువురు రెబల్ ఎమ్మెల్యేలకు సందేశాలు పంపుతున్నట్టు చెబుతున్నారు.


ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే శనివారంనాడు శివసేన నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానాలు చేశారు. శివసేన పేరును కానీ, శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్‌సాహెబ్ థాకరే పేరును కానీ ఏ రాజకీయ పార్టీ, వర్గం ఉపయోగించుకోకుండా నిరోధించాలని కోరుతూ ఎలక్షన్ కమిషన్‌ను ఆశ్రయించారు.


కాగా, మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 287 స్థానాలు ఉన్నాయి. విశ్వాస తీర్మానం గెలవాలంటే 144 మంది సభ్యుల బలం కావాలి. అధికార శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ కూటమికి 169 మంది సభ్యుల బలం ఉంది. ఏక్‌నాథ్ షిండేతో ఉన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన పక్షంలో మహా వికాస్ అఘాడి (MVA) బలం మెజారిటీ మార్క్‌ కంటే దిగువకు పడిపోతుంది. అదే జరిగితే, ఉద్ధవ్ సర్కార్ కుప్పకూలుతుంది.

Updated Date - 2022-06-26T20:39:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising