శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజమాసం, బహుళపక్షం; తిథి: షష్ఠి ఉ. 10.51 తదుపరి సప్తమి; నక్షత్రం: ఆర్ద్ర ఉ. 7.09 తదుపరి పునర్వసు; వర్జ్యం: రా. 8.25-10.11; దుర్ముహూర్తం: ఉ. 11.37-12.22; అమృతఘడియలు: లేవు; రాహుకాలం: మ. 12.00-1.30; సూర్యోదయం: 6.16; సూర్యాస్తమయం: 5.43
వారఫలాలు (జన్మ నక్షత్రం ప్రకారం) (24-10-2021)

మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం: ప్రతికూలతలు అధికం. ఆలో చనలతో సతమతమవుతారు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఏ విషయం పై ఆసక్తి ఉండదు. ఆత్మీయుల రాక ఉపశ మనం కలిగిస్తుంది. ఆది, మంగళవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. బాధ్యతలు అప్పగిం చవద్దు. కుటుంబీకులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు.

వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు: మీ సమర్థత మరొకరికి లాభి స్తుంది. పట్టుదలతో యత్నాలు సాగించండి. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. అనుభవ జ్ఞుల సలహా పాటించండి. పొదుపు పథకాల పై దృష్టి పెడతారు. బుధ, శుక్రవారాల్లో చెల్లింపుల్లోజాగ్రత్త. మానసికంగా కుదుట పడతారు. సంస్థల స్థాపనకు అనుకూలం. కనిపించకుండా పోయిన వస్తువులు, పత్రాలు లభ్యమవుతాయి. ఆధ్యాత్మికత పెంపొందు తుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు.

మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు: కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. అంచనాలు ఫలిస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ధన లాభం ఉంది. ఆప్తులకు సాయం అందిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. సోమ, మంగళ వారాల్లో పనులు సాగవు. పిల్లల ధోరణి చికాకుపరుస్తుంది. అనున యంగా మెలగండి. ఒక సంబంధం ఆలోచిం పచేస్తుంది. తొందర పాటు నిర్ణయాలు తగవు. గృహమార్పు కలిసివస్తుంది.

కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష: వ్యవహారాలు సమర్థంగా నిర్వ హిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభి స్తుంది. అందరితో సత్సంబంధాలు నెలకొం టాయి. ఖర్చులు విపరీతం. మీ ఉన్నతిని చాటు కోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. బుధవారం నాడు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పనులు అర్థాంతంగా నిలిపి వేస్తారు. పాత పరిచయస్తులను కలుసుకుం టారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహిం చండి. ప్రయాణం విరమించుకుంటారు.

సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం: పదవులు, బాధ్యతలు స్వీకరి స్తారు. పరిచయాలు బలపడతాయి. బాధ్య తగా వ్యవహరించాలి. ఎవరినీ అతిగా విశ్వ సించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టి స్తారు. గురు, శుక్రవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. డబ్బుకు లోటుండదు. చెల్లింపులు, పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఆరోగ్యోం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి.

కన్య

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు: ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. చెల్లింపుల్లో జాగ్రత్త. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు అధికం. ఖరీదైన వస్తు వులు కొనుగోలు చేస్తారు. శుక్ర, శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పెద్దల జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుతుంది.

తుల

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు: అనుకూలతలు అంతంత మాత్రమే. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవు తుంది. ఆది, సోమవారాల్లో పనులు మంద కొడిగా సాగుతాయి. బాధ్యతలు అప్పగించ వద్దు. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఇంటి విషయాలు పట్టించుకోండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది.

వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ: ఆర్థికస్థితి నిరాశాజనకం. పురో గతి లేక నిస్తేజానికి గురవుతారు. ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. బుధ, గురువారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు అర్థాంతరంగా ముగిస్తారు. గృహమార్పు అనివార్యం. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకువస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన ఉండదు. పిల్లల విషయంలో శుభపరిణామాలున్నాయి.

ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం: కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పదవులకోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. రోజువారీ ఖర్చులేఉంటాయి. సన్నిహితులకు సాయం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. వేడుకకు సన్నాహాలు సాగి స్తారు. పిల్లల చదువులపై దృష్టి పెట్టండి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం.

మకరం

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు: ఈ వారం అనుకూలదాయకం. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. వ్యాప కాలు సృష్టించుకుంటారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనుల్లో ఒత్తిడి అధికం. అయిన వారితోసంప్రదింపులు జరుపుతారు. వ్యవహార ఒప్పందాల్లో మెల కువ వహించండి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు.

కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు: శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఏ విష యాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. సోమ, మంగళవారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు.పనులు ముందుకు సాగవు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది.

మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి: వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహ పరుస్తుంది. ఓర్పుతో వ్యవహరించండి. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసి వస్తాయి, బుధ, శనివారాల్లో అనవసరజోక్యం తగదు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.