దినఫలాలు (31-03-2020)

మేషం

సోదరీసోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. విద్యార్థులకు శుభప్రదం. శుభవార్త అందుకుంటారు. ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి.

వృషభం

ఉన్నత విద్య, దూర ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. సినీ, రాజకీయ, బోధన రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. ఆర్థిక విషయాలకు సంబంధించిన సమాచారం అందుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి.

మిథునం

వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. పెట్టుబడులకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించిన పనులు పూర్తవుతాయి.

కర్కాటకం

రాజకీయ, సినీరంగ ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. విద్య, విదేశీ ప్రయాణాలకు సంబంఽధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత పదవులు అందుకుంటారు.

సింహం

సహకార సంఘాలు, యూనియన్‌ కార్యకలాపాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి సత్ఫలితాలు సాధిస్తారు. బోధన, రక్షణ, న్యాయ, రవాణా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం.

కన్య

గతించిన వ్యక్తులను స్మరించుకుంటారు. వారసత్వ విషయాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.

తుల

శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. జనసంబంధాలు విస్తరిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది. వేడుకలు, శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. స్పెక్యులేషన్లు లాభిస్తాయి.

వృశ్చికం

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, చిట్‌ఫండ్స్‌ రంగాల వారికి వృత్తి విషయాల్లో ప్రోత్సాహకరం. లక్ష్యసాధనలో గత అనుభవం ఎంతగానో తోడ్పడుతుంది. మెడికల్‌ క్లెయిమ్స్‌ మంజూరవుతాయి. విందుల్లో పూర్వమిత్రులను కలుసుకుంటారు.

ధనుస్సు

ప్రేమానుబంధాలు బలపడతాయి. శ్రీవారు, శ్రీమతి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పెట్టుబడులపై ప్రతిఫలం అందుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు.

మకరం

బదిలీలు, వృత్తి, వ్యాపారాల్లో మార్పులకు అనుకూలం. వైద్యం, హోటల్‌, రిటైల్‌ వ్యాపార రంగాల వారికి ప్రోత్సాహకరం. రియల్‌ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. విందు, వినోదాలతో ఉల్లాసంగా గడుపుతారు.

కుంభం

చిన్నారుల విద్యా విషయంలో శుభపరిణామాలు సంభవం. బోధన, విద్యాసంస్థలు, స్టేషనరి, రవాణా, ఏజెన్సీ రంగాల వారికి ప్రోత్సాహకరం. పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.

మీనం

రియల్‌ఎస్టేట్‌, గృహ నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. ఇంటికి అవసరమైన ఫర్నిచర్‌ సమకూర్చుకుంటారు. ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.