వారఫలాలు (జన్మ నక్షత్రం ప్రకారం) (21-11-2021)

మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం: ప్రతికూలతలు అధికం. ఓర్పుతో వ్యవహరించండి. సలహాలు,సాయం ఆశించవద్దు. విమర్శలు మీలో పట్టుదలను పెంచుతాయి. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. మంగళ, గురువారాల్లో ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. మీ ఆగ్రహావేశాలను అదుపులో ఉంచుకోండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం.

వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు: దృఢసంకల్పంతో శ్రమిస్తే విజ యం తధ్యం. యత్నాలు కొనసాగించండి. ఆప్తుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపు తాయి. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. రాబడిపై దృష్టి పెడతారు. బుధ, శుక్రవారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పిల్లల చదువులపై శ్రద్థ వహించండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. మొక్కులు తీర్చుకుంటారు.

మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు: అంచనాలు ఫలిస్తాయి. ధన లాభం ఉంది. ఖర్చులు అధికం. కొత్త పను లకు శ్రీకారం చుడతారు. ఆది, శనివారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. సంప్రదిం పులు వాయిదా పడతాయి. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. పత్రాల రెన్యువల్‌లో మెల కువ వహించండి. బాధ్యతలు అప్పగించ వద్దు. పనివారల నిర్లక్ష్యం ఆగ్రహం కలిగి స్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. బంధు వుల ఆతిఽథ్యం ఆకట్టుకుంటుంది.

కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష: ఆర్థికలావాదేవీలు కొలిక్కి వస్తాయి. రావలసిన ధనం అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. శుభకార్యం నిశ్చయమవు తుంది. బంధువుల రాకపోకలు అధికమవు తాయి. సోమ, మంగళవారాల్లో ఫోన్‌ సందేశాలను విశ్వసించవద్దు. కొత్త వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు.

సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం: కష్టానికి తగ్గ ప్రతిఫలం అం దుతుంది. పదవులు స్వీకరిస్తారు. పరిచయ స్తుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఖర్చులు అధికం. పొదుపు ధనం గ్రహిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. బుధ, గురువారాల్లో ఇతరులను మీ విషయా లకు దూరంగా ఉంచండి. వాదనలకు దిగవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. పిల్లల భవి ష్యత్తుపై మరింత శ్రద్థ వహించాలి.

కన్య

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు: ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. రశీదులు జాగ్రత్త. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉల్లాసంగా గడుపుతారు. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. శుక్ర, శని వారాల్లో కొత్త సమస్యలు ఎదురవుతాయి. లౌక్యంగా వ్యవహరించాలి. అనాలోచిత చర్యలు తగవు. పెద్దల సలహా పాటించండి. ఒక ఆహ్వానం సందిగ్థానికి గురిచేస్తుంది.

తుల

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు: కొంతమంది వ్యాఖ్యలు ఉద్రేక పరుస్తాయి. భేషజాలు, మొహమాటాలకు పోవద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నిం చండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయ స్కరం. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. పెట్టుబడులకు అనుకూలం కాదు. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగు తాయి. ఆప్తుల కలయికతో కుదుటపడతారు. పిల్లల విషయంలో శుభపరిణామాలున్నాయి.

వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ: ప్రతికూలతలతో సతమత మవుతారు. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగిం చండి. ఖర్చులు విపరీతం. ధనమూలన సమస్యలు ఎదురవుతాయి. సాయం అర్థించేం దుకు మనస్కరించదు. మంగళ, బుధవారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి.

ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం: వ్యూహాత్మకంగా అడుగులే స్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యవహార జయం, ధనయోగం ఉన్నాయి. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. పదవులు, సభ్యత్వాల స్వీక రణకు అనుకూలం. వ్యాపకాలు విస్తరిస్తాయి. సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు. పనులు సానుకూలమవుతాయి. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి.

మకరం

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు: వ్యవహార దక్షతతో నెట్టు కొస్తారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ధనలాభం ఉంది. ఖర్చులు అధిక, ప్రయోజనకరం. అయిన వారికి సాయం అందిస్తారు. పెట్టుబడులకు సమయం కాదు. ఆది, మంగళవారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు వాయిదా పడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.

కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు: ఈ వారం అన్ని రంగాల వారికీ అనుకూలం. పరిస్థితులు మెరుగుపడతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. మీ అభిప్రాయా లను మధ్యవర్తుల ద్వారా తెలియజేయండి. ఖర్చులు అంచనాలను మించుతాయి.డబ్బుకు ఇబ్బంది ఉండదు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్‌ సంస్థల్లో మదుపు తగదు. పనులు హడావుడిగా సాగుతాయి. పిల్లల మొండితనం అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి.

మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి: కార్యసిద్థికి ఓర్పు ప్రదానం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చీటికిమాటికి చిరాకుపడతారు. మీ కోపతా పాలు అదుపులో ఉంచుకోండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. పనులు ముందుకు సాగవు. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించ వద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. ఇంటి విషయాలపై శ్రద్థ వహించండి. శుభవార్తలు వింటారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.