(అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం)
మేష రాశి వారు ఈ ఏడాది ఆర్థి కంగా పురోగతి సాధిస్తారు. ఆస్తి పాస్తులు సమకూర్చుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. న్యాయవివాదాల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యా ర్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఉన్నత విద్య, విదేశీ గమన యత్నాలు ఫలిస్తాయి. జూన్-అక్టోబర్ మాసాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో కొంత నిరుత్సాహంగా ఉం టుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిళ్లు ఎదురవుతాయి. సన్ని హితులతో మాట పడాల్సి వస్తుంది.
గురువు ఈ ఏడాది 11, 12 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. ప్రమోషన్లు అందుకుంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. శుభకార్యాలకు అవకాశం ఉంది. వైవాహిక జీవితం ఉల్లాసంగా గడుస్తుంది. రక్షణ, సైన్స్, ప్రచురణలు, బోధన, న్యాయ, సినీ, రాజకీయ రంగాలవారికి ఆర్థికంగా ప్రోత్సాహం లభిస్తుంది. స్నేహానుబంధాలు పెంపొందుతాయి. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. టెక్స్టైల్స్, చలనచిత్రాలు, మత్స్య, రవాణా, టైల్స్, ఫొటోగ్రఫీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. జూలై 29 నుంచి నవంబర్ 23 వరకు ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ అఽధికం. పెద్దల ఆరోగ్యం మందగించ వచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి.
10, 11 స్థానాల్లో శని సంచారం కారణంగా కుటుంబ బాధ్యతలు అధికమవుతాయి. ఏప్రిల్ వరకు ఉన్నత చదు వుల్లో అశ్రద్ధ కారణంగా ఆశించిన ఫలితాలు సాధించ లేకపోతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. పిల్లలు-పెద్దల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. మే నుంచి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపా రంలో లాభాలు గడిస్తారు. విలాసాలకు ఖర్చు చేస్తారు. ఆందోళనలు అధికమవుతాయి. అన్నదమ్ములతో సఖ్యత లోపిస్తుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. శత్రు బాధ అధికంగా ఉంటుంది. ఆస్తి విషయాల్లో చికాకులు ఎదుర్కొంటారు. శని వక్రగమనంలో ఉన్న జూన్-అక్టోబర్ మాసాల మధ్య ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఓరిమితో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.
మీ జన్మ రాశి నుంచి 2, 8 స్థానాల్లో రాహు కేతువుల సంచారం ఫలితంగా విలాసాల ఖర్చులు అధికం. రుణ దాతల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. పన్నులు, బీమా, గ్రాట్యుటీ, రుణాల విష యాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొత్త అను బంధాల విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
శ్రీ ధన్వంతరి ఆరాధన శుభదాయకం.