
లక్ష్మీపుత్రులు..! కోట్లకు పడగలెత్తిన వారు..! అపర కుబేరులు..! హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ)..! ఏ పేరుతో పిలిచినా.. ఈ కేటగిరీకి చెందిన యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు భారత్‌ను వీడనున్నారు..! ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఈ ఏడాది చివరికల్లా ఏకంగా 8 వేల మంది లక్ష్మీపుత్రులు విదేశాలకు తట్టాబుట్టా సర్దుకోనున్నారట..!