బైక్‌ పైనుంచి పడి ఇద్దరికి తీవ్ర గాయాలు

Jul 23 2021 @ 00:48AM


బోధన్‌రూరల్‌, జూలై 22: బోధన్‌ పట్టణ శివారులోని మినార్‌పల్లి చౌరస్తా వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి ప్రమాదవశాత్తు పడిపోవడంతో తగిలెపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైనట్లు బోధన్‌ రూరల్‌ ఎస్సై సందీప్‌ తెలిపారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించామని తెలిపారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఆయన వివరించారు.

Follow Us on: