Advertisement

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

Mar 3 2021 @ 01:01AM
మహీధర్‌ రెడ్డి సమక్షంలో వైసీపీలోకి చేరిన ఆర్యవైశ్య నాయకులు

ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి

లింగసముద్రం, మార్చి 2: రెవెన్యూ అధికారులు సిబ్బంది, ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను వెంటనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీంధర్‌ రెడ్డి చెప్పారు. మంగళవారం లింగసముద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పనిచేసిన అధికారులు సక్రమంగా పనిచేయలేదన్నారు. దీంతో అనేక సమస్యలు పెరిగిపోయాయన్నారు. గతంలో పనిచేసిన తహసీల్దార్ల అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా లింగసముద్రంలో గంథ్రాలయాన్ని అక్రమించుకుని నిర్మాణం చేస్తున్నారని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ బ్రహ్మయ్య, ఎంపీడీవో మాలకొండయ్యలను ఆదేశించారు. 

పశువైద్యశాలలకు మందులు సరఫరా : కందుకూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని పశువైద్యశాలలకు కొవిడ్‌ నగదుతో అవసరమైన మందులు కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి చెప్పారు. కొవిడ్‌ సమయంలో విరాళాలుగా వచ్చిన నగదు నుంచి నియోజక వర్గంలోని వైద్యశాలలకు మందులు పంపిణీ చేయిస్తామన్నారు. పశువైద్యశాఖ డీడీ చంద్రశేఖర్‌, ఏడీ బ్రహ్మయ్య ఎమ్మెల్యేను కలిసి విషయాన్ని వివరించారు. 

టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిక : 

 మండలంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే సమక్షంలో పలు కుటుంబాలు వైసీపీలో చేరాయి. వేముల అంజయ్య కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో  వైసీపీ మండల కన్వీనర్‌ పీ.తిరుపతిరెడ్డి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ ఎం.శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ బాలకోటయ్య, ఎస్‌కే.షఫీ, పెన్నా కృష్ణయ్య, సర్పంచ్‌లు పీ పెదరాఘవులు, దామా సీతారామయ్య, పీ మహేష్‌ బాబు, వీ శ్రీనివాసులు, వైసీపీ నాయకులు వీ కృష్ణారెడ్డి, కనకం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.