ముంచుకొస్తున్నా..నిర్లక్ష్యంగా ముందుకు

ABN , First Publish Date - 2022-01-23T04:12:31+05:30 IST

కరోనా మళ్లీ విజృంభిస్తున్న క్రమంలో అధికార యంత్రాంగం ఉదాసీన వైఖరితో ఉంది.

ముంచుకొస్తున్నా..నిర్లక్ష్యంగా ముందుకు
దుకాణాల వద్ద మాస్కులు లేకుండా గుంపులుగా ఉన్న ప్రజలు

దూసుకొస్తున్న వైరస్‌

కానరాని కొవిడ్‌ నిబంధనలు

భౌతికదూరం ఊసేలేదు 

మాస్కుల మాటే లేదు

పట్టించుకోని అధికారులు

ప్రతి మండలంలోనూ కరోనా కేసులు

చర్యలు తీసుకోకుంటే భారీ మూల్యం తప్పదు


మూడోసారీ కరోనా దూసుకొస్తోంది.. అది ఒమైక్రానో..కరోనా తెలియనప్పటికీ ముప్పు ముంచుకొస్తోంది.. అయినా ప్రజలు నిర్లక్ష్యంగానే ముందుకు వెళ్తున్నారు. కొవిడ్‌ నిబంధనలు ఎక్కడా పాటిస్తున్నట్లు కన్పించడం లేదు. 

భౌతికదూరం ఊసేలేదు.. మాస్కుల మాటే లేదు. ఎక్కడ చూసినా గుంపుగుంపులుగా మాస్కులు లేకుండానే ప్రజలు కన్పిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు  తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పెద్ద దోర్నాల, జనవరి 22 : కరోనా మళ్లీ విజృంభిస్తున్న క్రమంలో అధికార యంత్రాంగం ఉదాసీన వైఖరితో ఉంది. ప్రజలను చైతన్యవంతం చేయడంతోపాటు జనసమర్ద ప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా ఆంక్షలు కఠితనం చేయడం లేదు. వ్యా పారులు కచ్చితంగా నిబంధనలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి. మాస్కు లేకుండా తిరిగితే తగిన అపరాధ రుసుము కూడా వసూలు చే యాలి. కొనుగోలు చేసేందుకు వచ్చిన వారు భౌతికదూరం పాటించి, మాస్కు లతో ఉండేలా చూడాలి. ఒకపక్క ఒమైక్రాన్‌ రూపంలో వైరస్‌ ముంచు కొస్తుంటే 80 శాతం ప్రజలు కొవిడ్‌ నిబంధనలను పాటించడం లేదు. ప్రధా నంగా మాస్కులు ధరించడం లేదు. గుంపులు ఉండవద్దని నిబంధన ఏమా త్రం పట్టించుకోవడం లేదు. కొవిడ్‌ నిబంధనలపై అటు అధికారులు, ఇటు పోలీసులు ప్రకటనలు ఇస్తున్నారే తప్ప వాటి అమలు, పర్యవేక్షణ విషయంలో ఏమాత్రం దృష్టి సారించడం లేదు. దీంతో ప్రజలు కూడా నిర్లక్ష్యంగా రోజు వారీ కార్యకలాపాలు, వ్యాపారం, ఉద్యోగం, ప్రయాణం ఇలా ఎక్కడ చూసినా కొవిడ్‌ నిబంధనలు కన్పించడం లేదు. దీనిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు, విద్యాసంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు. ఇక్కడ మాత్రం అధికార వైసీపీ అందుకు భిన్నంగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే విద్యార్థులు, ఉపాధ్యాయులు జిల్లాలో పలు చోట్ల కరోనా బారిన పడ్డారు. అయినా పాఠశాలలు, కాలేజీలు కొనసాగు తున్నాయి. తరగతి గదుల్లో శానిటైజర్‌ ఉండదు, భౌతికదూరం లేదు. మాస్కులు పెట్టుకోరు. మరోపక్క కరోనాతో అల్లాడుతున్నారు. విద్యార్థుల విష యంలో తల్లిదండ్రుల్లో దడ మొదలైంది. మూడేళ్లుగా కరోనా కారణంగా తమ పిల్లల చదువులు నష్టపోయామని తల్లిదండ్రులు అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కరోనా కేసులు మొదలయ్యాయి. మరోపక్క డెం గ్యూ జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారు. దగ్గు, జలుబు, ఇంటి నొప్పులతో కూడిన జ్వరాలు ప్రతి చోటా ఉన్నాయి. అయినా వైద్యాధికారులు నివారణ చర్యలు తీసుకోవడం లేదు. గ్రామాల్లో జ్వరబాధితుల కోసం సర్వే చేయడం లేదు. జ్వరాలు ఉన్న గ్రామాల్లో వైద్య శిబిరాల నిర్వహణను మరిచారు. పేద ప్రజలు ఆర్‌ఎంపీల వద్ద మందులతో సరిపెట్టుకోవల్సిన పరిస్థితి దాపు రించింది. పీహెచ్‌సీల్లో వైద్యుల కొరత, మందుల కొరత తీవ్రంగా ఉంది. కరోనా ఇతర వ్యాధులకు సంబంధించిన పరీక్షలకు అవకాశం లేదు. అది ఏ రోగమో తెలియక ప్రజలు ఇంటి వద్దే ఏవోఒక మందులు మింగి మూల్గు తున్నారు. దీంతో వైరస్‌ వ్యాప్తి తీవ్రమవుతోందని ప్రజలు అంటున్నారు. అధికారులు ఇంటింటి సర్వే చేపట్టి రోగాన్ని గుర్తించి తగిన మందులను అందజేస్తే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని పలువురు పేర్కొంటున్నారు. 

ఇప్పటికైనా కరోనా కట్టడికి అధికారులు నడుంబిగించాలి. ప్రజలు కూడా తమవంతు బాధ్యతగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. కాదుపోదు అని నిర్లక్ష్యంగా ఉంటే భారీమూల్యం చెల్లించుకోకతప్పదని పలువురు హెచ్చరిస్తు న్నారు. అధికారిక సమాచారం మేరకు నల్లగుంట్ల 1, రామమచంద్రకోట 3, అయినముక్కుల 2, బొమ్మలాపురం 1, దోర్నాలలో 7, రిమ్స్‌లో ఇద్దరు చొప్పున కరోనా బాధితులు చికిత్సలు పొందుతున్నారు. ఒకరు మృతి చెందారు. మొత్తం 16 కేసులు నమోదయినట్లు తహసీల్దారు వేణుగోపాల్‌ తెలిపారు. అనధికారంగా 50మందికి పైగా కేసులు ఉండవచ్చని భావిస్తున్నారు. 



Updated Date - 2022-01-23T04:12:31+05:30 IST