జాక్ మా... మాట విలువ ఎంతంటే ?

ABN , First Publish Date - 2021-10-26T21:15:59+05:30 IST

తమకు వ్యతిరేకంగా మాట్లాడితే... హెచ్చరికలు ఎదుర్కోవాల్సి వచ్చే సంఘంటనలను తరచూ చూస్తూనే ఉంటాం. ఈ ధోరణి కొన్ని దేశాల్లో అధికంగా కనిపిస్తేూంటుంది.

జాక్ మా... మాట విలువ ఎంతంటే ?


న్యూయార్క్ : తమకు వ్యతిరేకంగా మాట్లాడితే... హెచ్చరికలు ఎదుర్కోవాల్సి వచ్చే సంఘంటనలను తరచూ చూస్తూనే ఉంటాం. ఈ ధోరణి కొన్ని దేశాల్లో అధికంగా కనిపిస్తేూంటుంది.  చైనాకు చెందిన‌ బిలియనీర్‌, ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మాకు అలాంటి ప‌రిస్థితే ఎదురైంది. ఏడాది క్రితం ఆయ‌న చేసిన‌ వ్యాఖ్యలు వ్యాపారంలో తీవ్రంగా న‌ష్ట‌పోయేలా చేశాయి. చైనా ప్ర‌భుత్వ ఆగ్ర‌హానికి గురై భారీ నష్టాల‌ను మూటగట్టుకున్నారు.


చైనా ఆర్థికవ్యవస్థలోని లోపాలున్నాయంటూ జాక్‌మా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలంటూ పాలకులకు  సలహా ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితి ‘రోగికి రాంగ్ మెడిసిన్ ఇచ్చినట్టు’గా ఉందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో... దేశాధినేత జిన్‌పింగ్‌ తీవ్రమైన ఆగ్రహానికి లోనయ్యారు. జాక్‌మా వ్యాపార సామ్రాజ్యంపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టారు. యాంట్‌ గ్రూప్‌ ఐపీవోను కూడా  అడ్డుకున్నారు. దీంతో స్టాక్‌ మార్కెట్లలో అలీబాబా సంస్థల షేర్లు ప‌తనమయ్యాయి. ఈ నేపధ్యంలో... ఏడాది కాలంలోనే అలీబాబా తన మార్కెట్‌ విలువలో 344 బిలియన్‌ డాలర్ల(మ‌న క‌రెన్సీలో 25 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు)ను కోల్పోయారు.

Updated Date - 2021-10-26T21:15:59+05:30 IST