అనకాపల్లి జిల్లా

ABN , First Publish Date - 2022-04-04T06:55:34+05:30 IST

కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా జిల్లా రెవెన్యూ, డివిజనల్‌ రెవెన్యూ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.

అనకాపల్లి జిల్లా

విస్తీర్ణం: 4,291 చ.కి.మీ.లు

జనాభా: 17.27 లక్షలు (2011 ప్రకారం)

పురుషులు: 8.55 లక్షలు, మహిళలు: 8.72 లక్షలు

పార్లమెంటు నియోజకవర్గం: అనకాపల్లి

అసెంబ్లీ నియోజకవర్గాలు: అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి, పాయకరావుపేట, చోడవరం, మాడుగుల, పెందుర్తి (పరవాడ, సబ్బవరం మండలాలు)

రెవెన్యూ డివిజన్లు: అనకాపల్లి, నర్సీపట్నం

మునిసిపాలిటీలు: నర్సీపట్నం, ఎలమంచిలి

మండలాలు: 22

రెవెన్యూ గ్రామాలు: 731

గ్రామ పంచాయతీలు: 646

సముద్ర తీరం: 53 కి.మీ.లు

మొత్తం నివాసాలు: 4.53 లక్షలు 

ప్రధాన జలాశయాలు: తాండవ, రైవాడ, పెద్దేరు, కోనాం, కల్యాణపులోవ

ప్రధాన పరిశ్రమలు: అచ్యుతాపురం సెజ్‌, నక్కపల్లి హెటెరో డ్రగ్స్‌, పరవాడ ఫార్మా సిటీ, మాకవరపాలెం అన్‌రాక్‌, పాయకరావుపేట డెక్కన్‌ కెమికల్స్‌


డీఆర్వోలు, ఆర్డీవోల బదిలీ

- అనకాపల్లి డీఆర్వోగా వెంకటేశ్వర్లు

- పాడేరు డీఆర్వోగా దయానిధి

- భీమిలి ఆర్డీవోగా భాస్కరరెడ్డి

- విశాఖ ఆర్డీవోగా హుస్సేన్‌ సాహెబ్‌


విశాఖపట్నం, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా జిల్లా రెవెన్యూ, డివిజనల్‌ రెవెన్యూ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అనకాపల్లి జిల్లా రెవెన్యూ అధికారిగా తోటపల్లి బ్యారేజ్‌ ప్రాజెక్టు-3 స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్లును, అల్లూరి సీతారామరాజు జిల్లా రెవెన్యూ అధికారిగా శ్రీకాకుళం డీఆర్వో బి.దయానిధిని నియమించింది. విశాఖ డీఆర్వో ఎస్‌.శ్రీనివాసమూర్తిని ఇక్కడే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. భీమిలి ఆర్డీవోగా గుంటూరు ఆర్డీవో ఎస్‌.భాస్కరరెడ్డిని నియమించగా, విశాఖ ఆర్డీవో కె.పెంచల కిశోర్‌ను ఏలూరు ఆర్డీవోగా బదిలీ చేసి, ఆయన స్థానంలో నెల్లూరు ఆర్డీవో డి.హుస్సేన్‌ సాహేబ్‌ను నియమించింది. అనకాపల్లి ఆర్డీవో జె.సీతారామమూర్తిని పెద్దాపురం ఆర్డీవోగా బదిలీచేయగా, ఆయన స్థానంలో కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణను నియమించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టరు పి.విశ్వేశ్వరరావును భూపరిపాలన చీఫ్‌ కమిషనర్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ సెక్రటరీగా, నగరంలో జాతీయ రహదారుల విభాగం-16లో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న కె.హేమలతను పాలకొండ ఆర్డీవోగా, కలెక్టరేట్‌లో భూ పరిరక్షణ విభాగం ఎస్డీసీ బి.రమణను కాకినాడ ఆర్డీవోగా, విశాఖ పోర్టు ట్రస్ట్‌లో డిప్యూటీ ఎస్టేట్‌ అధికారిగా పనిచేస్తున్న బి.సుబ్బారావును తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ అఽధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.

Updated Date - 2022-04-04T06:55:34+05:30 IST