మహిళల సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-04-24T04:50:19+05:30 IST

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు.

మహిళల సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యం
సున్నా వడ్డీ చెక్కును ఇస్తున్న ఎమ్మెల్యే తలారి వెంకట్రావు

దేవరపల్లి, ఏప్రిల్‌ 23: మహిళా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. నియోజకవర్గంలోని 6584 మందికి రూ.8,81,12,000 సున్న వడ్డీ వచ్చిందన్నారు. దేవరపల్లి మండలంలో 1671 గ్రూపులకు రూ.2.18 కోట్లు, ద్వారకాతిరుమల మండలం 1673 సంఘా లకు రూ.2.45కోట్లు, గోపాలపురం 1352 సంఘాలకు, రూ.1.35కోట్లు, నల్లజర ్ల 1888 సంఘాలకు రూ.2.83 కోట్లు సున్నా వడ్డీ సొమ్ము వచ్చిందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎం.రామకృష్ణ, ఏపీఎం శ్రీనివాసరావు, డ్వాక్రా సంఘాల ప్రతినిధులు, కేవీకే దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.


బుట్టాయగూడెం: మహిళా పథకాలను ప్రవేశపెట్టి క్రమం తప్ప కుండా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. కెఆర్‌ పురంలో శుక్రవారం జరిగిన సున్నా వడ్డీ పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బుట్టాయగూడెం మండలం 1098 గ్రూపులకు రూ.95,13,487, జీలుగుమిల్లి మండలంలో 603 గ్రూపులకు రూ.60,45,317, కుక్కునూరు మండలం 931 గ్రూపులకు రూ.1,26,59,697, పోలవరం మండలం 1112 గ్రూపులకు రూ.1,36,09,623, వేలేరుపాడు మండలం 422 గ్రూపులకు రూ. 30,86,331, టి.నర్సాపురం మండలం 1383 గ్రూపులకు రూ.2,26,36,049, కొ య్యలగూడెం మండలం 1714 గ్రూపులకు రూ.2,38,40,618 సున్నా వడ్డీగా మంజూరు చేసినట్లు తెలిపారు.


కొవ్వూరు : కొవ్వూరు పట్టణంలో 624 డ్వాక్రా సంఘాలకు సున్నావడ్డీ రాయితీ వచ్చిందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి అన్నారు. గురువారం పట్టణంలోని 2వ సచివాలయంలో శుక్రవారం మెప్మా ఇన్‌చార్జి జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రత్నకుమారి మాట్లాడారు. పట్టణంలోని 720 డ్వాక్రా సంఘాలకు గాను 624 గ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పధకం మంజూరు అయ్యిందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ వరిగేటి లలితకుమారి, ఆర్‌పీలు, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T04:50:19+05:30 IST