ఎకరం రూ. 40 వేలు

ABN , First Publish Date - 2022-05-29T07:00:08+05:30 IST

‘గతేడాది మీకు ఎకరం కౌలు రూ.30 వేలకే ఇచ్చా. ఇప్పుడు రూ.40 వేలు పలుకు తోంది.

ఎకరం రూ. 40 వేలు

ఆల్‌ టైం కౌలు  రికార్డు

పొగాకు మార్కెట్‌  ఆశాజనకం.. సాగుకు మొగ్గు

రైతుల మధ్య పోటీ.. అమాంతం పెరిగిన కౌలు

సన్నకారు రైతులకు తీవ్రభారం, నష్టం

‘గతేడాది మీకు ఎకరం కౌలు రూ.30 వేలకే ఇచ్చా. ఇప్పుడు రూ.40 వేలు పలుకు తోంది. రోజూ చాలా మంది వచ్చి కలుస్తు న్నారు. మీకు ఓపికుం టే చెప్పండి. ముందు గా మీకే అవకాశం ఇస్తున్నా. రూ.40 వేలకు ఓకేనంటే ఈ ఏడాది మా భూమి మీకే ఇస్తా’ 

ఇదీ వర్జీనియా పొగాకు సాగు చేసే పొలాల పరిస్థితి. రోజు రోజుకు భూమి కి పెరుగుతున్న డిమాండ్‌తో కౌలు ధరలు పైపైకి వెళు తున్నాయి. ఈ ఏడాది పొగాకు మార్కెట్‌ ఆశాజనకంగా ఉండ టంతో కౌలు భూము లకు డిమాండ్‌ పెరిగింది. పొగాకు సాగు వద్దని ప్రత్యా మ్నాయ పంటలు సాగు చేసిన వారు పొగాకు సాగుకు సన్నద్దం అవుతు న్నారు. 


పొగాకు సాగుకు మొగ్గు

జిల్లాలోనే ప్రధాన వాణిజ్య పంట పొగాకు సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది పొగాకు మార్కెట్‌ బాగుంది. నాణ్యమైన పొగాకుతోపాటు లోగ్రేడ్‌కు  కొంతలో కొంత మంచి ధరలే వస్తున్నట్టు రైతులు చెబుతున్నా రు. కేజీ పొగాకు గరిష్టంగా రూ.195తోపాటు లో గ్రేడ్‌ పొగాకును కొనుగోలు చేస్తున్నారు. ఇది గమనించి భూమి యజమానులు అమాంతం భూమి కౌలు ధరలు పెంచేశారు. దీనికితోడు రైతుల మధ్య పోటీ నేపథ్యంలోను కౌలు ధరలు పెరిగాయి. గతేడాది ఎకరం రూ.25 వేల నుంచి రూ.32 వేల వరకు ఉన్న భూములు ఈ ఏడాది రూ.40 వేలు చెబుతుంటే కౌలు రైతుల ఆశలు నిరాశ అవుతున్నాయి.


పొగాకు బోర్డులు

జిల్లాలో జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం–1, కేంద్రం–2, కొయ్యలగూడెం, దేవరపల్లి, గోపాలపురంలలో మొత్తం 5 వేలం కేంద్రాల ద్వారా వర్జీని యా పొగాకు కొనుగోలు చేస్తుంటారు. జిల్లాలో మొత్తం 14,600 బ్యారన్‌లు, 1,500 అనధికారిక బ్యారన్‌లు ఉన్నాయి. ఒక సీజన్‌కు వచ్చి 60 వేల నుంచి 70 వేల ఎకరాలల్లో సాగు చేసేవా రు. కొన్నేళ్లుగా బోర్డు నిబంధనలు, మార్కెట్‌ సరిగా గిట్టుబాటు కాక చాలామంది రైతులు వరి, మొక్కజొన్న, కూరగాయలు, పామాయిల్‌ తదితర ప్రత్యామ్నాయ పంటలకు దిగారు.


సాగు ప్రారంభం

1965లో మన ప్రాంతంలో మొదటిసారి పొగాకు పండించారు. పంటను రైతుల నుంచి దళారులు కొనుగోలు చేసుకుని ప్రైవేట్‌ కంపెనీలకు అమ్మేవారు. ఆ సమయంలో రైతులు ఎన్నో మోసాలకు గురయ్యేవారు. 1974లో పొగాకు బోర్డు ఆక్షన్‌ సిస్టం ద్వారా పొగాకును కొనుగోలు చేసేవారు. జంగారెడ్డిగూడెం, దేవరపల్లిలలో వేలం కేంద్రాలు ఉండేవని పలువురు చెబుతున్నారు. బోర్డు కొనుగోలు వల్ల చట్టభద్రత, గిట్టు బాటు ధరలు, మనీ గ్యారంటీల వల్ల పొగాకు బోర్డులలోనే అమ్మకాలు చేసేవారు. తరువాత కొయ్యలగూడెం, గోపాలపురం కేంద్రాలను ప్రారంభించి కోనుగోలు చేయడం మొదలు పెట్టారు. ఆ సమయంలో భూమి కౌలు ధర వందలలో ఉండేది. రోజు కూలీలకు రూ.50 కంటే తక్కువే ఇచ్చేవారు. అప్పుడు కేజీ పొగాకును రూ.25కు కొనుగోలు చేసేవారు. ఇలా కొనసాగిన పొగాకు సాగు రెండు, మూడేళ్లపాటు మంచి ధర పలికింది. ఈ సమయం వరకు ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో కౌలు భూమి ధరలు అందుబాటులో ఉండేది. ఈ ధర అనంతరం ఒక్కసారిగా కౌలు ధరలు రైతుల మధ్య వచ్చిన పోటీతో ఆకాశాన్ని అంటాయి. అధిక లాభాలను తీసుకు వస్తుందని ఎంతో మంది రైతులు పొగాకు సాగుకు దిగి ఒక్కసారిగా సాగు విస్తీర్ణాన్ని ఊహించని రీతిలో పెంచేశారు.  


వందల నుంచి.. వేల వరకు

ఒకప్పుడు ఏజెన్సీ భూములకు విలువే ముంది అనుకునే వారు. ఇప్పుడు అటు వంటి వారందరూ ఆశ్చర్యపోతున్నారు. వర్జీనియా పొగాకు ఇక్కడ పరిస్థితినే మార్చేసింది. ఎకరం కౌలు రూ.వందల నుంచి ప్రస్తుతం రూ.40 వేలకు చేరింది. ప్రస్తుతం మార్కెట్‌లో గిట్టుబాటు ధర ఉందనే ఉద్దేశంతో రైతుల మద్య పోటీ పెరిగింది. కౌలు ధరలు పెంచుతూ పోతున్నారు. కానీ ఇది చాలా ప్రమాద కరమని పలువురు అభిప్రాయపడు తున్నారు. నాలుగేళ్ల క్రితం వరుసగా నష్టాల బాట పట్టిన పొగాకు రైతులు ఈ సాగం టేనే బెంబేలెత్తిపోయారు. అప్పట్లో అప్పులు వచ్చినా కౌలు మాత్రం తగ్గిం చలేదు. మార్కెట్‌ బాగున్న సమయాల్లో రైతుల మధ్య పోటీతో పెంచిన కౌలు ధరలు మార్కెట్‌ లేకున్నా తగ్గించడం లేదు. ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు.

– జంగారెడ్డిగూడెం

Updated Date - 2022-05-29T07:00:08+05:30 IST