స్వతంత్ర భారతంలో బిజినెస్‌ను ఓ రేంజ్‌కు తీసుకెళ్లిన 10 మంది Doyens..

Published: Sat, 13 Aug 2022 13:54:17 ISTfb-iconwhatsapp-icontwitter-icon
స్వతంత్ర భారతంలో బిజినెస్‌ను ఓ రేంజ్‌కు తీసుకెళ్లిన 10 మంది Doyens..

స్వతంత్ర భారతదేశంలో బిజినెస్‌ను ఓ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తులు పలువురు ఉన్నారు. ఒక చిన్న వ్యాపారంతో ప్రయాణం ప్రారంభించి దేశ విదేశాల్లో తమ ఫుట్ ప్రింట్‌ను వేసిన 10 మంది బిజినెస్ మ్యాగ్నెట్‌లపై ఓ లుక్కేద్దాం. 


1. గౌతమ్ అదానీ(Gowtham Adani) : 


గౌతమ్ అదానీ.. ఒకప్పుడు గుజరాత్‌లో కూడా పెద్దగా తెలియని వ్యాపారవేత్త. కానీ ఇప్పుడు ఇండియా మొత్తం ఆయన చాలా ఫేమస్. అంతేకాదు.. ప్రపంచ కుబేరుల్లో ఒకరు. 1980 చివరలో ఒక చిన్న కమోడిటీ ట్రేడింగ్ హౌస్ నుంచి ఆయన వ్యాపారం ప్రారంభమైంది. ఆ తరువాత లిబరలైజేషన్ వచ్చింది. ఇది గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఓ రేంజ్‌లో విస్తరించేందుకు వేదికగా నిలిచింది. ఆయన వ్యాపారం మల్టీ-కమోడిటీ స్టార్-రేటెడ్ ఎగుమతి సంస్థగా పెరగడమేకాదు.. గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని ముంద్రా వద్ద భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఓడరేవు వరకూ ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది.


2. అనిల్ అగర్వాల్(Anil Agarwal) : 


అనిల్ అగర్వాల్ ఉవ్వెత్తున ఎగిసిన కెరటం. కానీ అంతలోనే పడిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రయాణం మొత్తం చేదు-తీపి జ్ఞాపకాలతో నడుస్తోంది. అనిల్ అగర్వాల్‌కు ఇప్పుడు 68 ఏళ్లు. స్క్రాప్ మెటల్ డీలర్ నుంచి కేవలం రెండు దశాబ్దాలలో భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తలలో ఒకరిగా ఎదిగారు. వేదాంత ఇప్పుడు జింక్, సీసం, వెండి, రాగి, ఇనుప ఖనిజం, అల్యూమినియం, విద్యుత్ ఉత్పత్తి, చమురు, వాయువులపై ఆసక్తితో ప్రపంచవ్యాప్తంగా విభిన్న సహజ వనరుల సమ్మేళనం దిశగా అడుగులు వేశారు. అగర్వాల్ తాను ఎదుర్కొన్న కష్టాలతో ఒక డాక్యుమెంట్‌ను రూపొందించారు. 


3. అంబానీలు(Ambani): 


ధీరూభాయ్ అంబానీ 1950ల చివరలో భారతదేశంలో టెక్స్‌టైల్ మిల్లును స్థాపించడానికి యెమెన్‌లోని అడెన్ నుంచి తిరిగి వచ్చినప్పుడు.. ఆయన ఓ రేంజ్‌కి ఎదుగుతారని ఎవ్వరూ ఊహించలేదు. అప్పుడు పార్సీ, మార్వాడీ కుటుంబాల ఆధిపత్యంలో ఉన్న భారతీయ వ్యాపారాలు అంబానీని తమకొక ముప్పుగా చూడలేదు. 1977లో అంబానీ తన కంపెనీని లిస్ట్ చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఇప్పుడు ఆదాయంలో భారతదేశపు అతిపెద్ద కంపెనీ. 2002లో అంబానీ వీలునామా రాయకుండా మరణించడంతో.. ఆయన కుమారులు ఫ్లాగ్‌షిప్ కంపెనీ నియంత్రణపై పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేశారు. మొత్తానికి ఈ వ్యవహారమంతా 2005లో ఓ కొలుక్కి వచ్చింది. అప్పటి నుంచి ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అభివృద్ధి పథంలో నడవగా.. అనిల్ అంబానీ నిర్వహిస్తున్న వ్యాపారాలు మాత్రం కోర్టు మెట్లెక్కాయి. 


4. రాహుల్ బజాజ్(Raul Bajaj) : 


మహాత్మా గాంధీ పెంపుడు కుమారుడు జమ్నాలాల్ బజాజ్.. బజాజ్ గ్రూప్‌ వ్యవస్థాపకుడు. ఆయన మనవడు రాహుల్ బజాజ్ ఈ గాంధీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లారు. లైసెన్స్ రాజ్‌కు వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం చేయడం, లక్షలాది మంది భారతీయులకు ద్విచక్ర వాహనాన్ని సొంతం చేసుకునే అవకాశం కల్పించడం నుంచి అధికారంలోకి వచ్చే వరకు రాహుల్ బజాజ్ ముందుండి నడిపించారు. "హమారా బజాజ్" అనేది స్కూటర్‌తో ఎంత అనుబంధం కలిగిందో, దానిని నడిపే వ్యక్తితో కూడా అంతే అనుబంధం ఏర్పడింది. నేడు ఆయన వ్యాపార సామ్రాజ్యం.. బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ హోల్డింగ్స్‌ వరకూ విస్తరించింది. సంస్థ రూ. 8.4 ట్రిలియన్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను కలిగి ఉంది.


5. సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్(Suchin Bansal and Binni Bansal)


ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు, ఇప్పుడు ఫిన్‌టెక్ స్పేస్ (నవీ టెక్నాలజీస్) వ్యవస్థాపకుడు అయిన సచిన్ బన్సాల్ కొన్నాళ్ల క్రితం తన స్టార్టప్ ద్వారా ప్రయాణాన్ని ప్రారంభించారు. సచిన్ స్టార్టప్ ప్రయాణం అంత సులభంగా ఏమీ సాగలేదు. 2007లో ఫ్లిప్‌కార్ట్ మొదటి ఆర్డర్‌ను అందించింది. కోరమంగళలోని వారి అద్దెకు తీసుకున్న రెండు పడకగదుల ఇల్లు భారతదేశంలో ఇ-కామర్స్‌ను కూల్ చేసిన ఆన్‌లైన్ బుక్ స్టోర్‌కు కేంద్రంగా ఉంది. బన్సాల్ ద్వయం భారతీయ ఇ-కామర్స్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తులుగా గుర్తుండిపోతారు.


6. R C భార్గవ(RC Bhargava) : 


1981లో మారుతీ (అప్పటి మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్) వ్యవస్థాపక సభ్యుడు. ఆయన 1990 నుంచి 1997 వరకూ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2003లో భారత ప్రభుత్వం దానిని సుజుకి మోటార్ కార్ప్‌కు విక్రయించింది. "RC భార్గవ లేకపోతే, సుజుకి మోటార్ కార్పోరేషన్ భారతదేశంలో ఇంతటి విజయం సాధించేది కాదని సుజుకి మోటార్ కార్ప్ ఛైర్మన్ ఒసాము సుజుకి 2015లో ఫోర్బ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.


7. ఆదిత్య బిర్లా, కేఎం బిర్లా(Aditya Birla and KM Birla) :


ఘనశ్యామ్ దాస్ బిర్లా చిన్న కుమారుడు బసంత్ కుమార్ బిర్లా. ఆయన గ్రూప్‌నకు చెందిన కంపెనీలు - కేసోరామ్ ఇండస్ట్రీస్, సెంచురీ టెక్స్‌టైల్స్, సెంచురీ ఎంకా, జయశ్రీ టీ అండ్ ఇండస్ట్రీస్ - స్టాక్ మార్కెట్‌లో స్టార్లుగా వెలుగొందుతున్నాయి. ఆయన కుమారుడు ఆదిత్య విక్రమ్ బిర్లా కుటుంబ వ్యాపారాన్ని భారతదేశ సరిహద్దులు దాటించేశారు. 1969లో మలేషియాలో మొదటి విదేశీ వస్త్ర యూనిట్‌ను స్థాపించి, ఇండోనేషియాలో వంట నూనె యూనిట్‌ను స్థాపించారు. 1995లో ఆదిత్య బిర్లా క్యాన్సర్‌తో మరణించిన తర్వాత, అతని కుమారుడు కుమార్ మంగళం బిర్లా బాధ్యతలు చేపట్టారు. నేడు ఆదిత్య బిర్లా గ్రూప్ ఆదాయం $60 బిలియన్లలో సగం విదేశాల నుంచి వచ్చింది. కుమార్ మంగళం బిర్లా ఆధ్వర్యంలో విలీనాలు, కొనుగోళ్ల ద్వారా సామ్రాజ్యం విస్తరించింది. అల్ట్రాటెక్ సిమెంట్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌ను అనంతరం స్థాపించారు. ఇటీవల USలోని అలబామాలో గ్రీన్‌ఫీల్డ్ అల్యూమినియం తయారీ ప్లాంట్‌లో ఇండియా ఇంక్ అతిపెద్ద విదేశీ పెట్టుబడులలో ఒకటిగా ప్రకటించింది. 


8. కిషోర్ బియానీ (Kishor Biyani)..


తాను సృష్టికర్త, విధ్వంసకుడినని ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకుడు కిషోర్ బియానీ తన పుస్తకం ఇట్ హ్యాపెండ్ ఇన్ ఇండియాలో వెల్లడించారు. నిజమే.. 61 ఏళ్ల ఈ వ్యాపారవేత్త రిటైల్ ప్రయాణం.. ఎత్తు పల్లాలతో కూడుకున్నది. 1990ల ప్రారంభంలో డెనిమ్ బ్రాండ్‌ల తయారీ నుంచి బియానీ రిటైల్ వ్యాపారంలో అన్ని ప్రయోగాలూ చేసింది. Pantaloons గొడుగు కింద చిన్న, పెద్ద-ఫార్మాట్ ఫ్యాషన్ స్టోర్లను రోలింగ్ చేసింది. 2001లో బిగ్ బజార్ హైపర్‌మార్కెట్ చైన్‌తో భారతదేశంలో ఆధునిక రిటైల్‌ను పరిచయం చేశారు. వెరసి అప్పులు పెరిగాయి. మొత్తానికి చివరకు తన వ్యాపారాలన్నింటినీ విక్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. 


9. సుభాష్ చంద్ర(Subhash Chandra) :


1992లో జీ టీవీని ప్రారంభించి.. తద్వారా భారతదేశంలోని కేబుల్, శాటిలైట్ టీవీ విప్లవానికి ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర నాంది పలికారు. అయితే హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌ని ప్రారంభించడానికి ముందు ఆయన ప్రయాణం చాలా సాఫీగా సాగింది. FMCG కంపెనీలు, ఫార్మా మేజర్‌ల కోసం ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను తయారు చేసే వ్యాపారం, చంద్ర సోదరుడు అశోక్ గోయెల్ నిర్వహించే ఎస్సెల్ ప్రొప్యాక్, 2019లో రూ.3,200 కోట్లకు బ్లాక్‌స్టోన్‌కు విక్రయించబడింది. 


10. M A చిదంబరం(MA Chidambaram) :


ఎంఏ చిదంబరం స్కూటర్ విప్లవాన్ని తీసుకువచ్చిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. భారతదేశంలో పెట్రోకెమికల్స్ రంగం అదృష్టాన్ని మలుపు తిప్పిన వ్యక్తి. ఒక విప్లవాత్మక క్రికెట్ నిర్వాహకుడు. మద్రాసుకు మేయర్‌గా పనిచేశారు. MA చిదంబరం అనేక కోణాలు కలిగిన వ్యక్తి. సామాన్యుడి వాహనంగా పిలిచే ఇటాలియన్ లాంబ్రెట్టాను భారతీయ రోడ్లపై నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. అగ్రి బిజినెస్, కెమికల్స్, పెట్రోకెమికల్స్, డిటర్జెంట్స్, ఎలక్ట్రానిక్స్, షిప్పింగ్, ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్, పోర్ట్ మేనేజ్‌మెంట్ ఇలా ఎన్నో రంగాలలో తనదైన ముద్ర వేశారు.Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

బిజినెస్Latest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.