షాపింగ్ కాంప్లెక్స్ వద్ద భక్తులతో కిక్కిరిసిన క్యూలైను
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నుంచే తిరుమల క్షేత్రం యాత్రికులతో కిటకిటలాడుతున్న విషయం తెలిసిందే. శనివారం తరహాలోనే ఆదివారం కూడా సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది. రాత్రి ఏడు గంటల సమయానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లతోపాటు నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండిపోయి క్యూలైన్ ఎంబీసీ వరకు వచ్చింది. వీరికి 10 గంటల దర్శన సమయం పడుతోంది. కాగా, ఆదివారం రాత్రి సమయానికి క్యూలైన్‌లో చేరే భక్తుల సంఖ్య తగ్గింది. సోమవారం రద్దీ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శ్రీవారి ఆలయం ముందు భక్తుల రద్దీ