ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన 10 విషజీవులు.. ముట్టుకుంటే ప్రాణాలు పోవడమే!

ABN , First Publish Date - 2022-06-20T17:51:34+05:30 IST

ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో ఒక్కోసారి...

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన 10 విషజీవులు.. ముట్టుకుంటే ప్రాణాలు పోవడమే!

ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో ఒక్కోసారి అంతే ప్రమాదకరం. ప్రపంచంలో అనేక అందమైన జీవులు ఉన్నాయి. అవి తమ అందంతో అందరినీ ఆకర్షిస్తాయి. ఇదేవిధంగా చాలా ప్రమాదకరమైన, విషపూరిత జీవులు కూడా ఉన్నాయి. వీటిని తాకిన వ్యక్తి ప్రాణాలను కోల్పోతాడు. ఆ అత్యంత ప్రమాదకరమైన విషజీవులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


ఫన్నెల్ వెబ్ స్పైడర్

దీనిని ఆస్ట్రేలియాలో కనుగొన్నారు. అందుకే దీనిని ఆస్ట్రేలియన్ ఫన్నెల్ వెబ్ స్పైడర్ అని కూడా పిలుస్తారు. దీని విషం సైనైడ్ కంటే ప్రమాదకరం. ఈ సాలీడు ఎవరినైనా కుడితే 15 నిమిషాల నుంచి 3 రోజుల వ్యవధిలో చనిపోతారని చెబుతారు. 


ఇండియన్ రెడ్ స్కార్పియన్

ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన తేలు. ఇది మొదట భారతదేశంలో కనిపించింది. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ సహా దక్షిణాసియా దేశాల్లో కనిపించే ఈ తేలు మనిషిని కాటేస్తే 72 గంటల్లో మరణం ఖాయం.


బాక్స్ జెల్లీ ఫిష్

జెల్లీ ఫిష్ ఎంత అందంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ జాతి బాక్స్ జెల్లీ ఫిష్ చాలా విషపూరితమైనది. దీని విషం ఒకేసారి 60 మందిని చంపేస్తుందని చెబుతారు. 


బ్లూలైన్ ఆక్టోపస్

ఈ ఆక్టోపస్ పరిమాణం టేబుల్ టెన్నిస్ బాల్ అంత చిన్నది. ఇది ఎక్కువగా ఆస్ట్రేలియా, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, పాపువా న్యూ గినియాలో కనిపిస్తుంది. దాని విషం మొదట కళ్ళను, శ్వాసకోశ వ్యవస్థను విఫలం చేస్తుంది.


మార్బుల్డ్ కోన్ కోన్ స్నెల్

దీని విషం ఇతర జీవులను అంధులను చేస్తుంది. తరువాత శ్వాసకు ఆటంకం ఏర్పడుతుంది, పక్షవాతం వచ్చి చివరకు మరణం సంభవిస్తుంది. 



కింగ్ కోబ్రా

ఈ పాము ఆసియాకు చెందినది. ప్రధానంగా భారతదేశంలోని అడవులలో కనిపిస్తుంది. ఇది ఒక స్టింగ్‌లో 5 రెట్లు ఎక్కువ విషాన్ని విడుదల చేస్తుంది.


డార్ట్ ఫ్రాగ్

దక్షిణ అమెరికాలో కనిపించే ఈ కప్ప దాని రంగుతో ఎరను ఆకర్షిస్తుంది. ఎంత అందంగా కనిపిస్తుందో అంతే ప్రాణాంతకం.


ఇన్లాండ్ తైపాన్

ఆస్ట్రేలియాలో కనిపించే ఇన్‌ల్యాండ్ తైపాన్ చాలా విషపూరితమైన పాము జాతులకు చెందినది. దీని విషంలో న్యూరోటాక్సిన్ ఉంటుంది, ఇది 45 నిమిషాల్లో మనిషిని చంపుతుంది.



స్టోన్ ఫిష్

సముద్రంలో కనిపించే ఈ చేప చాలా విషపూరితమైనది. దీని విషంతో ఇతర జీవులు పక్షవాతానికి గురవుతాయి.


పఫర్ ఫిష్ 

ఇది చాలా అందంగా ఉంటుంది. ఇది చాలా విషపూరితమైనది. జపాన్, చైనా, ఫిలిప్పీన్స్, మెక్సికోలలో ఇది కనిపిస్తుంది.

Updated Date - 2022-06-20T17:51:34+05:30 IST